Champions Trophy Final Match: కుల్దీప్.. రచిన్, విలియమ్సన్ వికెట్లు తీసి ఇండియాకు వైపు మ్యాచ్

Champions Trophy Final Match:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ (Champions Trophy Final Match) జరుగుతోంది. దుబాయ్ వేదికగా టీమిండియా (Team India), న్యూజిలాండ్ (Newzland) మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తోంది. కివీస్ ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారు. ఈ సమయంలో భారత్ బౌలర్లు బాగా ఆడారు. ఓవర్ ఇచ్చిన వెంటనే వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్‌ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. దీంతో 57 పరుగుల వద్దే న్యూజిలాండ్ ఒక వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ క్రీజుకి వచ్చాడు. ఇంతలో కుల్దీప్ యాదవ్ మరో వికెట్ తీశాడు. 10.1 పరుగుల వద్ద రచిన్ రవీంద్రను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్ క్రీజులోకి వచ్చాడు. ఇంతలో కుల్ దీప్ యాదవ్ మరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేన్ విలియమ్సన్‌ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు. వరుసగా మూడు వికెట్లు పడటంతో మ్యాచ్ గెలుపు టీమిండియా వైపు మళ్లింది. కుల్దీప్ కీలక వికెట్లను పడగొట్టాడు. దీంతో న్యూజిలాండ్ బ్యాటర్లు ప్రస్తుతం నిలకడగా ఆడుతున్నారు. వరుస వికెట్లు పడటంతో బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. న్యూజిలాండ్ 20 ఓవర్లలో 100 పరుగులు చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో టీమిండియా మొదటి నుంచి ఓటమి లేకుండా ఆడుతోంది. ఈ ఫైనల్లో కూడా ఆట కనబరచుతోంది. భారత బౌలర్లు 20 ఓవర్లలో 100 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. కీలకమైన వికెట్లు తీయడంతో మ్యాచ్ మొత్తం ఒక్కసారిగా భారత్ వైపు తిరిగింది. ఇదే నిలకడను టీమిండియా చివరి వరకు కొనసాగిస్తే విజయం మనదే. అయితే 2000లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించే ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఈ సారి మరి టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి మ్యాచ్ గెలుస్తుందో లేదో చూడాలి.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
న్యూజిలాండ్ జట్టు
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమిసన్, విలియం ఓరూర్కే, నాథన్ స్మిత్ ఆడుతున్నారు.
-
BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?