BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో

BCCI:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీమిండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ నుంచి ఓటమి లేకుండా టీమిండియా అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. ఛాంపియన్స్‌గా నిలిచింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచినందుకు బీసీసీఐ టీమిండియాకు భారీ నజరానా ప్రకటించింది. మొత్తం రూ.58 కోట్ల రూపాయలను టీమిండియాకి అందజేయనున్నట్లు తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ.
హిట్ మ్యాన్ రోహిత్ సారథ్యంలో టీమిండియా మరోసారి ఐపీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత ట్రోఫీని సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంది. టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు టీమిండియాకు బీసీసీఐ ఈ భారీ నజరానా ప్రకటించింది. ఈ మొత్తం నజరానాను జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్, సెలక్షన్ కమిటీకి కూడా ఇస్తారు. అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్‌ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లిన టీమిండియా ఆటగాళ్ల అందరికి బీసీసీఐ ఈ నజరానాను ప్రకటించింది. ఈ నజరానాలో ఎవరెవరికి ఎంత వస్తుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా టీమిండియా గతేడాది జరిగిన టీ 20 ప్రపంచకప్‌ను కూడా సొంతం చేసుకుంది. ఈ సమయంలో బీసీసీఐ భారత జట్టుకు భారీ నజరానా ప్రకటించింది. మొత్తం రూ.125 కోట్ల నజరానాను టీమిండియాకు అందజేసింది. ఈ మొత్తం రూ.125 కోట్లలో జట్టులోని ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా తీసుకున్నారు. ఒకోక్కరికి బీసీసీఐ రూ.5 కోట్లు ఇచ్చింది. ఇక సహాయక కోచ్‌లకు అయితే రూ.2.5 కోట్లు అందజేసింది. మిగతా ఇతర సహాయక సిబ్బందికి ఒకోక్కరికి రూ.2 కోట్లు ఇచ్చింది. అయితే సెలక్షన్ కమిటీ సభ్యులకు కూడా ఇచ్చింది. రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్‌మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్‌లకు కూడా కోటి అందజేశారు. వీరితో పాటు సపోర్ట్ స్టాఫ్‌కి, రాహుల్ ద్రవిడ్‌కి ఒకేలా ఇచ్చినట్లు సమాచారం. ఇలానే ఈ సారి ప్రైజ్ మనీని కూడా ఇస్తారని అంటున్నారు. మరి ఎవరెవరికి ఎంత బీసీసీఐ అందజేస్తుందో చూడాలి.
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
BCCI: కుటుంబానికి నో ఎంట్రీ.. కోహ్లీ వ్యాఖ్యలపై తగ్గిన బీసీసీఐ
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Champions Trophy Final Match: కుల్దీప్.. రచిన్, విలియమ్సన్ వికెట్లు తీసి ఇండియాకు వైపు మ్యాచ్
-
Champions Trophy Final Match: టీమిండియాకి బిగ్ షాక్.. షమీకి గాయం.. మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం పడుతుందా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. గాయంతో హెన్రీ దూరం?