Gautam Gambhir: కోచ్‌గా వచ్చాడు.. చెత్త రికార్డులు సృష్టించాడు.. వద్దంటున్న ఫ్యాన్స్!

Gautam Gambhir: టీమిండియా కోచ్‌గా గౌతమ్ గంభీర్ అయినప్పటి నుంచి ఎన్నో చెత్త రికార్డులు సాధించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కూడా భారత్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసి కూడా మ్యాచ్ ఓడిపోయిన ఫస్ట్ జట్టుగా టీమిండియా జట్టు చెత్త రికార్డును పొందింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా అయినప్పటి నుంచి టీమిండియా 9 టెస్టుల్లో ఒకటి మాత్రమే విజయం సాధించింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చిన వెంటనే గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లోనూ కూడా భారత్ ఓటమి పాలైంది. ఈ సిరీస్ కనుక టీమిండియా గెలిచి ఉంటే ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడేది. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఓటమి పాలైంది. న్యూజిలాండ్ జట్టు విదేశాల్లో గెలిచి కూడా చాలా ఏళ్లు అయ్యింది. అప్పుడు శ్రీలంక చేతుల్లో టెస్టు సిరీస్‌లో ఓడిపోయి.. ఇండియాలో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించింది. 3-0 తేడాతో భారత్ జట్టు న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోయింది. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత భారత్ జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోయింది. ఆస్ట్రేలియా టూర్లో కూడా ఐదు టెస్టుల సిరీస్‌ని టీమిండియా 3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. విరాట్ కోహ్లీ, అజింకా రహానే కెప్టెన్సీలో బాగా ఆడినా కూడా భారత జట్టు 10 ఏళ్ల తర్వాత ఈ టెస్టు సిరీస్ ఓడిపోయింది.
Read Also:Railway Track Car Driving: తప్ప తాగి రైల్వే ట్రాక్ ఎక్కిన యువతి.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు!
ఇటీవల అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. గత 9 టెస్టుల్లో టీమిండియా గెలిచిన విజయం.. జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై గెలవడమే. నిజానికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు రిటైర్ కావడంతో భారత జట్టుపైన పెద్దగా అంచనాలు లేవు… అనుభవం లేని భారత జట్టు, ఇంగ్లాండ్ చేతుల్లో ఓడిపోతుందని అభిమానులు ముందుగానే ఊహించారు. ఐదు సెంచరీలు చేసినా కూడా భారత్ జట్టు ఓటమి పాలైంది. కుర్రాళ్లతో నిండిన టీమ్, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చూపించిన కసి, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో చూపించలేకపోయింది. 371 పరుగుల స్కోరు చేసిన తర్వాత డిఫెన్సివ్ ఫీల్డింగ్ సెట్ చేయడం, క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని ఆశ్చర్యపరిచింది. ఇదే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని వెంటనే ఆ పొజిషన్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి ముందు స్వదేశంలో శ్రీలంకతో వన్డే సిరీస్‌లోనూ 2-0 తేడాతో ఓడింది భారత జట్టు. 47 ఏళ్ల తర్వాత టీమిండియాకి స్వదేశంలో లంక చేతుల్లో వన్డే సిరీస్ ఓడింది. ఇలా గంభీర్ కోచింగ్‌లో భారత జట్టుకి దక్కిన విజయాల కంటే ఎదురైన పరాభవాలు, అవమానాలే ఎక్కువ.
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Rishabh Pant: ఫ్రస్టేషన్లో రిషబ్ పంత్.. హెల్మెట్‌ను నేలకేసి కొట్టి.. వీడియో వైరల్!
-
IND vs ENG: మొదటి టెస్ట్‌లో భారత్ ఓటమి.. కారణాలివే!
-
China Ban : చైనా దెబ్బకు భారత్ లో ప్రమాదంలో 21,000ఉద్యోగాలు
-
Shubman Gill: కొత్త టెస్ట్ కెప్టెన్సీ.. రికార్డు సృష్టించిన శుభమాన్ గిల్
-
Viral Video : మనుషుల కంటే ఆవులే బెటర్.. జాతీయగీతానికి నిలబడి గౌరవించిన గోమాత