Teamindia: టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఫిక్స్ అయ్యేది ఆ రోజే!

Teamindia: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్ తర్వాత వరుసగా కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు టీమిండియా కెప్టెన్‌ను ఎవరిని ఫిక్స్ చేస్తారని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే బీసీసీఐ యాజమాన్యం శుభమన్ గిల్ లేదా రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు బుమ్రా పేరు కూడా ఫస్ట్‌లోనే ఉంది. కాకపోతే బుమ్రా తరచుగా గాయాలకు గురి అవుతున్నాడు. ఒకవేళ కెప్టెన్‌గా నియమిస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది ఏమోనని టీమిండియా భావిస్తోంది. అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని ఈ నెల 24న బీసీసీఐ ప్రకటించనుంది. వచ్చే నెల 20వ తేదీన ఇంగ్లాండ్ పర్యటన ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ టీమిండియా కెప్టెన్‌ను ప్రకటించనుంది. అయితే 23వ తేదీన బీసీసీఐ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్‌తో పాటు జట్టు తుది ఎంపిక కూడా జరుగుతుంది. సమావేశం జరిగిన తర్వాత రోజు బీసీసీఐ ఎవరు టీమిండియా కెప్టెన్ అనే విషయాన్ని ప్రకటిస్తుంది.
Also Read: Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
ఇదిలా ఉండగా టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రిషబ్ పంత్, గిల్, బుమ్రా పేర్లు మాత్రమే కాదు.. రవీంద్ర జడేజా పేరు కూడా ఉంది. ఇతనికి కూడా కెప్టెన్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రవీంద్ర జడేజాను యాజమాన్యం ఎంపిక చేస్తుందని టీమిండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు స్పోర్ట్స్ కథనాలు చెబుతున్నాయి. రవీంద్ర జడేజా బౌలింగ్ మాత్రమే కాదు.. బ్యాటింగ్‌లో కూడా అదరగొడతాడు. టెస్ట్ ఫార్మాట్‌లో టీమిండియాకు భారీ విజయాలు కావాలి. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించే వారినే ఎంపిక చేయడానికి యాజమాన్యం భావిస్తోంది. ఈ క్రమంలోనే బుమ్రా, రవీంద్ర జడేజా వంటి బలమైన క్రికెటర్లలో ఎవరో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
టీమిండియా వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ ఇంగ్లాండ్ సిరీస్‌లో టీమిండియా ఏకంగా ఐదు టెస్టులు ఆడనుంది. టీమ్ ఇండియా ఈ సిరీస్ ద్వారా 2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ మొదలు పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా ఆడే అతిపెద్ద టెస్ట్ సిరీస్‌లలో ఇదే పెద్ది. ఈ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో కూడా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. కాకపోతే ముందు ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది. సో ఇదే అతిపెద్ద టెస్ట్ సిరీస్. ఇందులో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరచాలంటే మాత్రం తప్పకుండా సారధిపైనే ఉంటుంది. జట్టును బలంగా ముందుకు నడిపించి విజయాన్ని అందించే వారినే కెప్టెన్‌గా నియమించాలని యాజమాన్యం భావిస్తోంది.
-
IPL 2025 : బీసీసీఐ నిర్ణయం పై మండిపడుతున్న అభిమానులు..కోల్‌కతా ఫ్యాన్స్ ఆగ్రహావేశాలు!
-
BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో
-
BCCI: ఆ రూల్ మార్చం.. తగ్గేదేలే అంటున్న బీసీసీఐ
-
BCCI: కుటుంబానికి నో ఎంట్రీ.. కోహ్లీ వ్యాఖ్యలపై తగ్గిన బీసీసీఐ
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. గాయంతో హెన్రీ దూరం?