Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
Small AC: కేవలం రూ.2,000 లోపే దొరికే కొన్ని కూలర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి వేడి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా వేల రూపాయలను కూడా ఆదా చేస్తాయి.

Small AC: ప్రస్తుతం వేసవి మధ్యకు వచ్చేశాం. ఎండలు మండిపోతున్నాయి. 9గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు. దీంతో కాస్త చల్లదనం కూడా కాస్త శరీరానికి ఉపశమనం అందిస్తుంది. ఇంట్లో ఉంటే గాలి తగలక ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం. దీంతో ఏసీ ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. కానీ ఏసీ అంటే ఖరీదైనది కాబట్టి చాలా మంది కూలర్లతో కాలం గడిపేస్తుంటారు. అయితే తక్కువ ధరలో ఏసీ లాంటి అనుభూతి కావాలనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. కేవలం రూ.2,000 లోపే దొరికే కొన్ని కూలర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇవి వేడి నుంచి ఉపశమనం ఇవ్వడమే కాకుండా వేల రూపాయలను కూడా ఆదా చేస్తాయి. పెద్ద సైజు కూలర్లు కొనాల్సిన అవసరం లేకుండా ఈ పోర్టబుల్, కాంపాక్ట్ సైజు కూలర్లు చల్లదనాన్ని అందిస్తాయి. వీటి ప్రత్యేకతలు, ధరలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Tata Nano: అసంపూర్ణంగా రతన్ టాటా కోరిక.. తన డ్రీమ్ కారుతో ఆయన చేయాలనుకున్న పని ఇదే!
1. పోర్టబుల్ రీఛార్జబుల్ కూలర్ (Portable Rechargeable Cooler):
ఈ పోర్టబుల్ రీఛార్జబుల్ కూలర్ మీ గదిని చల్లగా ఉంచుతుంది. ఇది చార్జ్ చేసుకునే వ్యక్తిగత ఎయిర్ కూలర్. ఇందులో ఐస్ లేదా నీళ్లు వేసి నడుపుకోవచ్చు. ఇది చిన్న సైజులో ఉంటుంది కాబట్టి, ఎప్పుడైనా, ఏ గదికి కావాలంటే ఆ గదికి తీసుకెళ్లొచ్చు. ప్రయాణాల్లో కూడా దీన్ని వెంట తీసుకెళ్లొచ్చు. దీని లుక్ చాలా బాగుంటుంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా దొరుకుతుంది. ప్రస్తుతం భారీ డిస్కౌంట్‌తో అమెజాన్‌లో కేవలం రూ.499కి లభిస్తోంది!
2. మినీ పోర్టబుల్ ఎయిర్ కూలర్ (Mini Portable Air Cooler):
ఈ కూలర్ 3 స్పీడ్ ఫ్యాన్, LED లైట్‌తో వస్తుంది. రాత్రిపూట ఎక్స్‌ట్రా లైట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కూలర్ లైటే సరిపోతుంది. దీనిలో వాటర్ ట్యాంక్ ఉంటుంది. ఫిల్టర్ కూడా ఉంటుంది కాబట్టి శుభ్రమైన గాలి అందుతుంది. ఇది కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కేవలం రూ.899కి లభిస్తుంది.
Also Read: Urine Infection: మహిళల్లో పదే పదే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందా? అయితే ఇదే కారణం కావొచ్చు
3. వాలొరెక్స్ పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్ (VALOREX Portable Mini Air Cooler):
ఈ పోర్టబుల్ మినీ కూలర్‌లో 3 స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇందులో మిస్ట్ హ్యుమిడిఫైయర్ ఆప్షన్ కూడా ఉంది. అంటే, మీరు చల్లని గాలిని మాత్రమే కాదు, సువాసనతో కూడిన గాలిని కూడా ఆస్వాదించవచ్చు. డిస్కౌంట్‌తో ఇది ఆన్‌లైన్‌లో రూ.1,799కి లభిస్తోంది.
ఈ కూలర్లన్నీ ఆన్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ ధరలో మంచి కూలర్‌ను కొనుగోలు చేసి, వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
-
Summer: వేసవి సెలవుల్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండాలంటే.. వీటిని నేర్పించండి
-
Beer Price : మందుబాబులకు ప్రతి రోజూ పండగే…200 బీర్ ఇక రూ.50కే
-
Summer Drinks : వేసవిలో డ్రింక్స్ కంటే.. ఈ వాటర్ బెటర్
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Ice creams: సమ్మర్‌లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?