Summer: వేసవి సెలవుల్లో పిల్లలకు బోర్ కొట్టకుండా ఉండాలంటే.. వీటిని నేర్పించండి

Summer: వేసవి స్కూల్ సెలవులు వల్ల చాలా మందికి బోరు కొడుతుంది. కొందరు పిల్లలు బయటకు వెళ్తుంటారు. మరికొందరు పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. వేసవిలో ఎండ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపించరు. రోజంతా ఇంట్లోనే ఉంచడంతో వారు బోర్‌గా ఫీల్ అవుతారు. ఇక ఇంట్లోనే అల్లరి చేస్తుంటారు. అయితే వేసవిలో పిల్లలకు బోర్ కొట్టకుండా ఇంట్లోనే చిన్న చిన్న పనులు నేర్పించండి. దీనివల్ల వారు బోర్‌గా ఫీల్ కారు. అయితే పిల్లలకు వేసవిలో నేర్పించాల్సిన పనులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
పరిశుభ్రత నేర్పించండి
పిల్లలకు పరిశుభ్రతను తప్పకుండా నేర్పించండి. బోర్ కొడుతుందని పిల్లలు అంటే వారితో ఇంటిని శుభ్రం చేయించండి. అధిక వర్క్ ఉండే పనులు కాకుండా చిన్న చిన్న పనులు నేర్పించండి. అల్మారాలు సర్దడం, పుస్తకాలు సర్దడం వంటి చిన్న పనులు చేయించండి. దీనివల్ల వారికి పనులు రావడంతో పాటు బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే అసలు ఉండదు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
పుస్తకాలు చదవడం
వేసవిలో చాలా మంది పిల్లలు మొబైల్ పట్టుకుని సమయం గడుపుతారు. కాస్త సమయం దొరికితే చాలు ఇంకా మొబైల్ గేమ్స్ వంటివి ఆడుతారు. అయితే పిల్లలకు వేసవిలో పుస్తకాలు చదవడం అలవాటు చేయండి. బొమ్మల పుస్తకాలు చదివించడం, బొమ్మలు గీయమనడం వంటివి చేయించండి. దీనివల్ల వారికి వాటిపై ఇంట్రెస్ట్ ఆటోమెటిక్‌గా పెరుగుతుంది. ఇక పిల్లలకు అసలు బోర్ కొట్టదు.
పిల్లలతో గేమ్స్
ఇంట్లోనే పిల్లలను ఉంచితే బోర్ కొడుతుంది. ఇలా కాకుండా తోటి పిల్లలతో క్యారమ్స్, చెస్ వంటి గేమ్స్ ఆడేలా చేయండి. వీటివల్ల వారికి మైండ్ పవర్ కూడా బాగా పెరుగుతుంది.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
పాటలు
కొందరు పిల్లలకు సంగీతం అంటే ఇష్టం ఉంటుంది. స్కూల్ ఉన్న సమయంలో నేర్చుకోవడానికి అసలు టైమ్ ఉండదు. కాబట్టి వేసవిలో పిల్లలకు సంగీతం క్లాస్‌లకు పంపించండి. దీనివల్ల వారికి బోర్ కొట్టకుండా ఉండటంతో పాటు యాక్టివ్‌గా కూడా ఉంటారు.
మొక్కలు నాటించండి
వేసవిలో పిల్లలకు మొక్కలు నాటించి డైలీ వాటిని నీరు పోయమని చెప్పండి. అలాగే గార్డెన్ క్లీన్ చేయడం, కొత్త మొక్కలు డైలీ నాటమని చెప్పడం వంటివి చేయండి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి వాటిని అలవాటు చేయండి. దీనివల్ల వారికి ప్రకృతి మీద ప్రేమ ఏర్పడుతుంది.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
కొత్త వంటలు నేర్పించండి
పిల్లలకు వేసవిలో వంటలు కూడా నేర్పించండి. అయితే అందరికీ కూడా వంటలు చేయడం అంటే ఇష్టం ఉండదు. ఎవరి పిల్లలకు అయితే ఇష్టం ఉంటుందో వారికే నేర్పించండి. వంటలు చేయడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఒత్తిడి అంతా కూడా పోతుంది. వేసవిలో పిల్లలకు ఇవే కాకుండా డ్యాన్స్, యోగా, మెడిటేషన్ వంటివి కూడా నేర్పించండి. వీటిని నేర్పించడం వల్ల పిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటారు.
-
Mobile: రోజుకి 4 గంటలకు మించి మొబైల్ చూస్తున్నారా.. ఈ వార్నింగ్ మీ కోసమే
-
Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
-
Meena Kumari: పెళ్లి, పిల్లలు, విడాకులు అన్ని 38 ఏళ్లకే.. కనిపించేంత అందంగా ఎవరి లైఫ్ ఉండదుగా!
-
Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్
-
Phone Battery Drain :మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? ఈ 5 సింపుల్ చిట్కాలు పాటించండి
-
Android 16 : ఆండ్రాయిడ్ 16తో దొంగలకు షాక్.. ఫోన్ దొంగిలిస్తే అంతే సంగతులు!