Mobile: రోజుకి 4 గంటలకు మించి మొబైల్ చూస్తున్నారా.. ఈ వార్నింగ్ మీ కోసమే

Mobile: ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ కూడా మొబైల్ వాడుతున్నారు. నిజం చెప్పాలంటే వారి జీవితంలో మొబైల్ ఒక భాగమైపోయింది. కొందరు అయితే రోజులో గంటల తరబడి ఫోన్‌ను చూస్తూనే ఉంటారు. ఇలా చూడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్పినా కూడా వినరు. ఎప్పుడో ఒకసారి ఇలా చూస్తే పర్లేదు. కానీ రోజులో ఎక్కువ సమయం చూడకూడదని నిపుణులు అంటున్నారు. అయితే రోజులో 4 గంటలకు మించి అసలు మొబైల్ చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 4 గంటలకు మించి పొరపాటున మొబైల్ చూస్తే మాత్రం అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనలు, ఒంటరితనం, చిరాకు, కోపం, కంటి సమస్యలు, మానసిక సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులో నాలుగు గంటలకు మించి మొబైల్ చూస్తుంటే అలర్ట్ పెట్టుకోండి. దీనివల్ల ఎక్కువ సమయం మొబైల్ చూడకుండా ఉంటారు. అయితే రోజులో ఎక్కువ గంటలు మొబైల్ చూడటం వల్ల వచ్చే సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే చిన్న విషయాలకి కోపం రావడం, చిరాకు పడటం వంటివి జరుగుతాయి. సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం, నచ్చినవి దొరకకపోవడం వంటివి నిరాశకు గురిచేస్తాయి. ముఖ్యంగా యువతలో తీవ్రమైన ఒత్తిడి, నిరాశ వల్ల ఆత్మహత్య ఆలోచనలు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి మెదడులోని మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. రాత్రిపూట ఫోన్ చూడటం వల్ల నిద్రకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కళ్లు పొడిబారడం, మంటలు, అలసట, దృష్టి మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో కళ్లకు శాశ్వత నష్టం కూడా జరగవచ్చు. ఫోన్‌ను వంగి చూడటం వల్ల మెడ, భుజాల కండరాలపై అధిక ఒత్తిడి పడి నొప్పులకు దారితీస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. శారీరక శ్రమ తగ్గి, ఒకే చోట కూర్చుని ఫోన్ చూడటం వల్ల ఊబకాయం సమస్య పెరుగుతుంది. ఫోన్‌కు అంకితమైపోవడం వల్ల సామాజిక సంబంధాలు బలహీనపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపలేరు. పనిలో, చదువులో ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Early Morning Anjeer: ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తీసుకుంటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!
-
Exercise: మనం ఎక్కువ సేపు కూర్చోవడం కోసం పుట్టలేదు.. అలా ఉంటే డేంజరే
-
Biryani With Drink: బిర్యానీ విత్ డ్రింక్ తాగుతున్నారా.. అయితే ఈ ఆర్టికల్ మీకోసమే!
-
Stress Relief: ఒత్తిడి నుంచి విముక్తి పొందాలంటే.. ఈ టైప్ ధ్యానం తప్పనిసరి
-
Breakfast: ప్రతీ రోజూ టిఫిన్ స్కిప్ చేస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే
-
Pani puri: ఇష్టమని పానీ పూరీ లాగించేస్తున్నారా.. ఈ సీజన్‌లో తింటే ప్రాణాలు గోవిందా!
-
Covid vaccine: కరోనా వ్యాక్సిన్‌తో గుండె పోటు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!