Summer Drinks : వేసవిలో డ్రింక్స్ కంటే.. ఈ వాటర్ బెటర్
Summer Drinks: వేసవిలో ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగడం కంటే ఆరోగ్యానికి మేలు చేసే.. నిమ్మరసం తాగడం మంచిదని అంటున్నారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అయితే వేసవిలో డైలీ నిమ్మరసం తాగితే.. ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలో ఈ స్టోరీలో చూద్దాం.

Summer Drinks : వేసవిలో చాలా మంది పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఎంత ఆరోగ్యమైన ఫుడ్ తీసుకున్నా కూడా వేసవిలో కాస్త నీరసంగా ఉంటుంది. దీనివల్ల చాలా మంది పండ్ల రసాలను ప్రాధాన్యత ఇస్తారు. పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే వేసవిలో చాలా మంది ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇవి ఆ నిమిషానికి వేసవి వేడి నుంచి విముక్తి కలిగించినా కూడా అనారోగ్య సమస్యల బారిన పడతారు. అయితే వేసవిలో ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగడం కంటే ఆరోగ్యానికి మేలు చేసే.. నిమ్మరసం తాగడం మంచిదని అంటున్నారు. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అయితే వేసవిలో డైలీ నిమ్మరసం తాగితే.. ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలో ఈ స్టోరీలో చూద్దాం.
రోగనిరోధక శక్తి
నిమ్మకాయలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. డైలీ ఉదయం లేదా సాయంత్రం నిమ్మరసం తాగడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. విటమిన్ సి వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులోని పోషకాలు స్కిన్ మెరిసేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే జలుబు, జ్వరం వంటివి కూడా రాకుండా చేస్తాయి.
జీర్ణక్రియ
నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా ఈజీగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకం, గ్యాస్ట్రిక్, జీర్ణ సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. వేసవిలో ఎక్కువగా నిమ్మరసం తాగడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు అయినా కూడా ఈజీగా తగ్గిపోతాయి. ముఖ్యంగా బరువు కూడా తగ్గుతారు.
హైడ్రేషన్
వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. వేసవిలో ఎంత నీరు తీసుకున్నా కూడా తక్కువే. అయితే నిమ్మరసం తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే తక్షణమే శక్తి లభిస్తుంది. దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి డైలీ నిమ్మరసం తీసుకోవడం వేసవిలో మంచిది.
బరువు తగ్గడం
ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల బరువు అదుపులో ఉండేలా చేస్తుంది. ఎక్కువ బరువు ఉన్నవారు డైలీ నిమ్మరసం తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే బాడీలోని వ్యర్థాలను కూడా నిమ్మరసం బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా కాలేయం, మూత్రపిండాల్లోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది పేగులను శుభ్రం చేస్తుంది.
రక్తపోటు
నిమ్మరసం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సమస్యలు అన్ని కూడా తగ్గుతాయి. వేసవిలో డైలీ నిమ్మరసం తాగితే తక్షణమే శక్తి రావడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటాయి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.
-
AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?
-
Ice creams: సమ్మర్లో పిల్లలకు ఇలాంటి ఐస్‌క్రీమ్స్ ఇస్తున్నారా?
-
Fridge: వామ్మో ఫ్రిజ్ లోని ఆహారం తింటున్నారా?
-
Summer : సమ్మర్ లో ప్రయాణమా? ఇవి మస్ట్..
-
National Cancer Grid : నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ఎలా పనిచేస్తుందంటే?
-
Vitamin D : విటమిన్ డి టాబ్లెట్స్, ఇంజెక్షన్లు కూడా తీసుకుంటున్నారా?