Idli and Dosa: ఇడ్లీ, దోస విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అంతే సంగతులు
Idli and Dosa: చాలా మంది సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇడ్లీ, దోస పిండిని కొనుగోలు చేస్తారు. వీటిని ఇతరులు సరిగ్గా చేయరు. వ్యాపారం అనేది వ్యాపారం లాగానే ఉంటుంది.

Idli and Dosa: చాలా మంది ఇడ్లీ, దోస వంటివి టిఫిన్స్‌గా ఎక్కువగా తీసుకుంటారు. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. రెండింటిలో కూడా పోషకాలు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇడ్లీ, దోసలో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. డైలీ ఇడ్లీ తినడం వల్ల ఉబ్బరం, మలబద్ధకం, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం అలాగే గుండె ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలా రావడానికి ముఖ్య కారణం ఇడ్లీ, దోస తినేటప్పుడు తెలియక కొన్ని తప్పులు చేయడమే. అయితే ఇడ్లీ, దోస విషయంలో ఎలాంటి తప్పులు చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: Kidney Stones : వేసవిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం.. ఎందుకు పెరుగుతాయి? ఎలా జాగ్రత్త పడాలి?
చాలా మంది సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇడ్లీ, దోస పిండిని కొనుగోలు చేస్తారు. వీటిని ఇతరులు సరిగ్గా చేయరు. వ్యాపారం అనేది వ్యాపారం లాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా వారు అసలు జాగ్రత్తలు తీసుకోరు. అయితే బయట కొనే రెడీమేడ్ దోస, ఇడ్లీ పిండిలు ఎక్కువ సమయం పులియ పెడతారు. వారు ఉదయం పూట వాటిని తయారు చేసి సాయంత్రం సమయాల్లో విక్రయిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇలా పులియబెట్టిన పిండి వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇడ్లీ, దోస పిండిని పులియబెట్టినప్పుడు ఎక్కువ సమయం ఉండటానికి కొందరు బోరిక్ యాసిడ్ కలుపుతారు. అయితే దీన్ని కలపడం వల్ల పిండి దుర్వాసన రాదు. అయితే ఈ యాసిడ్ మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఇలా పులియబెట్టినప్పుడు కోలి బాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. దీనవల్ల కూడా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మీరు బయట కొనుగోలు చేయవద్దు.
Also Read: Viral Video : కజ్రా రే పాటకు అవ్వచేసిన డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే.. కేక పుట్టించింది
ఇడ్లీ, దోస పిండిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న వాటిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా కుదట పడుతుంది. అయితే ముందుగా బియ్యం, పప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ చేసుకుని కేవలం ఆరు గంటలు మాత్రమే పులియబెట్టాలి. ఇలా చేసిన 24 గంటల్లో మాత్రమే ఇడ్లీ లేదా దోస చేసుకోవాలి. లేకపోతే మాత్రం మీకు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తాజాగా ఎప్పటికప్పుడు చేసుకున్న వాటిని మాత్రమే తినడం మేలు అని నిపుణులు చెబుతున్నారు.
-
Sugar Badam: షుగర్ బాదం డైలీ తింటే.. ఎలాంటి సమస్యలైనా చిటికెలో మాయం
-
Drinking Black Coffee: డైలీ బ్లాక్ కాఫీ తాగితే.. ఏమవుతుందో మీకు తెలుసా?
-
Healthy Juice: డైలీ దీనితో చేసిన జ్యూస్ తాగితే.. జీవితంలో అసలు డాక్టర్ అవసరమే రాదు
-
Onions Health Benefits: పచ్చి ఉల్లిపాయతో లక్షల ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తినడం మంచిదేనా?
-
Alkaline Water: ఆల్కలైన్ వాటర్‌కు ఎందుకింత డిమాండ్.. సెలబ్రిటీలు ఇదే తాగుతారా?
-
Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇప్పుడే తినండి.. మళ్లీ దొరకదు