Viral Video : కజ్రా రే పాటకు అవ్వచేసిన డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే.. కేక పుట్టించింది

Viral Video : వయసు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే అన్న సామెతను నిజం చేసింది, వయసు శరీరానికే గానీ మనసుకు కాదు అని అమ్మమ్మ తన డ్యాన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నటించిన సూపర్ హిట్ పాట ‘కజ్రా రే’ (Aishwarya Rai Kajra Re Song) కు ఈ అమ్మమ్మ చేసిన డాన్స్ (Old lady Dance On Kajra Re) వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె స్టెప్పులు, ఎక్స్ప్రెషన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియో నిజంగా మనసుకు హత్తుకునేలా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఆనందంగా ఎలా ఉండాలో చూపిస్తుంది.
ఈ వీడియో ఒక పెళ్లిలోని మెహందీ ఫంక్షన్ సందర్భంగా తీసినట్లు తెలుస్తోంది. వీడియోలో ఒక ‘అమ్మమ్మ’ ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమాలోని ‘కజ్రా రే’ పాటకు డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె డ్యాన్స్ స్టెప్పులు, ఎక్స్ప్రెషన్స్ చూస్తే వయసును మరిచిపోయిందన్నట్లుగా ఉంది. ప్రతి స్టెప్‌ను అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తూ, తన హావభావాలతో అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది.
Read Also:Viral Video : ట్రక్కు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడిన టాటా మ్యాజిక్.. చూస్తే గుండె దడ ఖాయం
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సహజమే. ఎందుకంటే, దాది అమ్మ అంత వయసులో కూడా అంత ఉత్సాహంగా, పూర్తి ఆదాబ్‌తో పాటలోని ప్రతి స్టెప్‌ను పర్ఫార్మ్ చేయడం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆమె డాన్స్ చూస్తే ఎవరికైనా రోజంతా మంచి ఎనర్జీ వస్తుంది. @3dt_dance_crew_pune అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మే 23న అప్లోడ్ అయిన ఈ వీడియో అప్లోడ్ అయిన కొన్ని గంటల్లోనే 10 లక్షలకు పైగా వ్యూస్‌ను, 68 లక్షలకు పైగా లైక్స్‌ను సాధించింది. కామెంట్ సెక్షన్లో నెటిజన్లు దాది అమ్మపై ప్రేమను కురిపిస్తున్నారు.
నెటిజన్లు అమ్మమ్మ డ్యాన్స్ చూసి ఎంతో ఆనందంగా కామెంట్స్ చేస్తున్నారు. “వావ్, ఎంత ఎనర్జిటిక్ అమ్మమ్మ! నిజంగానే వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. అమ్మమ్మను ఇంత ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ చూడడం చాలా బాగుంది. ఈ వీడియో ఎవరికైనా నవ్వు తెప్పిస్తుంది” అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అమ్మమ్మ ఆనందాన్ని, ఉత్సాహాన్ని చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ఆనందంగా ఉండటానికి వయసు అడ్డుకాదని ఈ అమ్మమ్మ నిరూపించింది.
Read Also:Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. నలుగురా? ఐదుగురా? కేబినెట్లోకి ఎవరెవరు?
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు