Viral Video : ట్రక్కు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడిన టాటా మ్యాజిక్.. చూస్తే గుండె దడ ఖాయం

Viral Video : సోషల్ మీడియాలో ఒక హృదయ విదారకమైన రోడ్డు ప్రమాద వీడియో వైరల్‌గా మారింది. ఈ సీసీటీవీ ఫుటేజీ చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక నిమిషం కూడా లేని ఈ వీడియో క్లిప్‌లో ప్రయాణికులతో నిండిన ఒక మ్యాజిక్ వాహనం అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది. రోడ్డు పక్కన నిలబడిన ఒక వ్యక్తిని ఎక్కించుకోవడానికి డ్రైవర్ అలా ఆపాడు. కానీ, ఆ తర్వాతి క్షణంలో జరిగిన ఘటన చూస్తే మీ గుండె బద్దలవుతుంది.
వైరల్ అవుతున్న CCTV ఫుటేజీలో ఏం జరిగిందో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ప్రయాణికులతో వెళ్తున్న మ్యాజిక్ వాహనం హఠాత్తుగా రోడ్డు మధ్యలో ఆగింది. మ్యాజిక్ వాహనం ఆగిన వెంటనే, వెనుక నుంచి ఓ అతి వేగవంతమైన ట్రక్కు దానిని ఊహించని రీతిలో ఢీకొట్టింది. ఆ ధాటికి మ్యాజిక్ వాహనం గాల్లోకి ఎగిరి పక్కకు పడిపోయింది. అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక బైక్ నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి, మ్యాజిక్ వాహనాన్ని ఢీకొని కిందపడిపోయాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిందని @gharkekalesh అనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్ వీడియోను షేర్ చేస్తూ తెలిపింది.
Read Also:Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ.. నలుగురా? ఐదుగురా? కేబినెట్లోకి ఎవరెవరు?
The Final Destination or Wot💀, Pilibhit UP
pic.twitter.com/8sOm1DvwcN— Ghar Ke Kalesh (@gharkekalesh) May 25, 2025
ఈ భయంకరమైన ప్రమాదం జరిగిన వెంటనే, ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ 54 సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో దాదాపు 10 లక్షల మందికి పైగా చూశారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్ల మధ్య ఒక పెద్ద చర్చ మొదలైంది. “ఈ ఘోర ప్రమాదానికి ఎవరు బాధ్యులు?” అని యూజర్లు వాదించుకుంటున్నారు. చాలా మంది యూజర్లు మ్యాజిక్ డ్రైవర్ రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని అతన్నే తప్పుబడుతున్నారు. మరికొందరు, ట్రక్కు డ్రైవర్ బ్రేక్ వేయగలడు కదా.. అతని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వాదిస్తున్నారు. కొందరు బైక్ నడుపుతున్న వ్యక్తి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ఈ విషయంపై పిలిభిత్ పోలీసులు స్పందించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను బ్యారికేడింగ్ చేసి పట్టుకున్నామని తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా వెల్లడించారు. కొన్ని సెకన్ల ఈ వీడియో క్లిప్ వాహనదారులకు ఓ మెసేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. రోడ్డు మీద చేసే చిన్న పొరపాటు కూడా ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే, ఎప్పుడూ వాహనం నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు.
Read Also:Covid 19: పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు