Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు మృతి
Road Accident లారీని స్పార్కియో వాహనం ఢీకొన ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మరణించారు.

Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం భైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మరణించారు. లారీని స్పార్కియో వాహనం ఢీకొన ఘటనలో అక్కడిక్కడే ముగ్గురు మరణించారు. స్కార్పియో వాహనం అదుపు తప్పి ముందున్న డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
వాహనం ఏపీ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే మృతుల్లో ఇద్దరు ఏపీ డీఎస్పీలు శాంతారావు, మేక చక్రధర్ లుగా గుర్తించారు. వీరిద్దరూ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ లో డ్యూటీ చేస్తున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీ ప్రసాద్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక డ్రైవర్ నర్సంగరావు పరిస్థితి విషమంగా ఉంది. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.