Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?

Champions Trophy:
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో గెలిచిన వారికి కేవలం ట్రోఫీ మాత్రమే కాకుండా ప్రైజ్ మనీని కూడా ఇస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టుకు ఐసీసీ 2.24 మిలియన్ల డాలర్ల ప్రైజ్ మనీని అందించింది. అంటే ఇండియన్ కరెన్సీలో మొత్తం రూ.19.5 కోట్లు అన్నమాట. అయితే టీమిండియా జట్టులోని ఒక్కో ఆటగాడికి దాదాపుగా రూ.1.3 కోట్లు లభించింది. దీనికి తోడు గ్రూప్ దశలో గెలిచిన మ్యాచ్‌లకు కూడా డబ్బులు ఇస్తారు. వీటి ద్వారా ఒక్కో ఆటగాడికి రూ.13 లక్షలు ఇచ్చారు. దీంతో పాటు ప్రతీ ఆటగాడికి కూడా దాదాపు 6 గ్రాముల బంగారంతో పూత పూసిన హై-గ్రేడ్ వెండితో తయారు చేసిన స్మారక పతకాన్ని కూడా అందజేశారు. అలాగే కోకా-కోలా, ఫ్యాన్‌క్రేజ్ వంటి స్పాన్సర్ల నుంచి ఆటగాళ్లకు వస్తాయి. దాదాపుగా 4.3 లక్షల విలువైన వస్తువులను గిఫ్ట్‌గా టీమిండియా ఆటగాళ్లకు ఇచ్చాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఒక్కో ఆటగాడు దాదాపుగా రూ.1.74 కోట్లు సంపాదించాడు.
ఇదిలా ఉండా ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ల డాలర్లు ఇచ్చారు. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా రూ. 9.78 కోట్లు అన్నమాట. అయితే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్‌కి చేరుకున్నాయి. మొదటి సెమీ ఫైనల్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగ్గా.. టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కి చేరింది. రెండో సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. కివీస్ గెలిచి ఫైనల్‌కి చేరింది. అయితే సెమీ ఫైనల్స్‌లో ఇంటి బాట పట్టిన జట్లుకి రూ.4.89 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు ఉండగా వీటిని రెండు గ్రూపులుగా విడదీశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో 5వ, 6వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.3.04 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వగా, 7, 8వ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.1.21 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా రవీంద్ర జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్