Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?

Champions Trophy 2025:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో పొంగిపోతున్నారు. న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియాను గెలిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ముఖ్యమైనది. మిగతా బ్యాటర్లు కూడా టీమిండియాను గెలుపు దిశగా తీసుకెళ్లారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత టీమిండియాకి ట్రోఫీ అందజేశారు. మీరు గమనిస్తే ఈ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా తెల్లని బ్లేజర్లు ధరించారు. అసలు ట్రోఫీని తీసుకునే సమయంలో తెల్లని బ్లేజర్లు ఎందుకు టీమిండియా ఆటగాళ్లు అందరూ కూడా ధరించారు? దీని వెనుక ఏదైనా కారణం ఉందా? అనే విషయం తెలుసుకుందాం.
ఛాంపియన్స్ ట్రోఫీని తీసకునే సమయంలో భారత జట్టు ఆటగాళ్లు తెల్లని బ్లేజర్స్‌తో కనిపించారు. అయితే విజేతగా నిలిచిన టీంకి గౌరవంగా ఈ ప్రత్యేకమైన తెల్ల బ్లేజర్‌ను ప్రదానం చేస్తారు. 2009 ఛాంపియన్స్ ఎడిషన్ నుంచి ఈ ప్రత్యేక తెల్ల బ్లేజర్స్‌ను ఇస్తున్నారు. ట్రోఫీతో పాటు తెల్లని బ్లేజర్స్‌ను సత్కరిస్తున్నారు. ఈ బ్లేజర్స్‌ను ప్రపంచ క్రికెట్ పాలక మండలి ఆమోదంతోనే తీసుకొచ్చారు. అయితే దీన్ని ముంబైకి చెందిన డిజైనర్ బబితా ఎం రూపొందించారు. తెల్లని రంగులో ఉండే ఈ బ్లేజర్‌ను ఇటాలియన్ ఉన్నితో తయారు చేశారట. ఇది చూడటానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనపై బంగారు రంగులో లోగో ఉంటుంది. దీనికి కాస్త ఎంబ్రాయిడరీ కూడా చేశారు. ఈ బంగారు రంగు లోగో ద్వారా ఈ బ్లేజర్ అందరీ దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే ఈ తెల్లని బ్లేజర్‌ను విజయానికి గుర్తుగా భావిస్తారు. దీంతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ గొప్పతనాన్ని సూచించే విధంగా ఈ తెల్లని బ్లేజర్స్‌ను ఆటగాళ్లకు ప్రదానం చేస్తారట.
ఇదిలా ఉండగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా రవీంద్ర జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు.
-
BCCI: టీమిండియా ఆటగాళ్లు నక్క తోక తొక్కారు పో
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!