ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!

ICC Champions Trophy:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో పొంగిపోతున్నారు. న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టిమిండియా మూడోసారి ఘన విజయం సాధించడంతో లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ ఆనందంతో చిన్న పిల్లాడిలా డ్యాన్స్ వేశారు. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు ట్రోఫీని ఇస్తుండగా.. సునీల్ గవాస్కర్ మైదానంలో చిన్నపిల్లాడిలా డ్యాన్స్ వేస్తూ ఎంతో సంబర పడ్డాడు. చిన్న పిల్లాడిలా సునీల్ డ్యాన్స్ వేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన ఆనందాన్ని అదుపు చేసుకోలేక.. మైదానంలో డ్యాన్స్ వేశాడు. 75 ఏళ్ల వయస్సులో ఇలా చిన్న పిల్లాడిలా ప్రవర్తించడం చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గవాస్కర్ ఇలా ప్రవర్తించడం చాలా క్యూట్‌గా ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు.
75 YEAR OLD SUNIL GAVASKAR DANCING AFTER INDIA'S VICTORY. 🤯❤️pic.twitter.com/DEuuYj4aWr
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు. అయితే భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. గతంలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2002లో గెలిచింది. ఆ తర్వాత 2013లో టీమిండియా గెలవగా మళ్లీ ఇప్పుడు గెలిచింది. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
Sunil Gavaskar is dancing like a kid during India's celebration.❤️ pic.twitter.com/OCa6sqvDYs
— Vipin Tiwari (@Vipintiwari952) March 9, 2025
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు బాగానే రాణించారు. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్ శాంట్నర్ (8) పరుగులు చేశారు. నాథన్ స్మిత్ 0 (1) నాటౌట్‌గా ఈ మ్యాచ్‌లో నిలిచాడు. భారత్ బౌలర్లు కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు