ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు

ICC Champions Trophy:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్‌పై 4 వికెట్ల తేడాతో మూడో సారి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించినా కూడా షమీ ఖాతాలో మాత్రం ఓ చెత్త రికార్డు యాడ్ అయ్యింది. గత మ్యాచ్‌ల్లో వికెట్లు తీసిన షమీ.. ఈ ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం కివీస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. మొత్తం తొమ్మిది ఓవర్లు బౌలింగ్ వేయగా.. అందులో 74 పరుగులు కివీస్‌కి ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వైపున ఎక్కువ పరుగులు ఇచ్చిన రెండో ఆటగాడిగా షమీ నిలిచాడు. అయితే పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ వహాబ్ రియాజ్ అత్యధిక పరుగులు ఇచ్చిన ఆటగాడిగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. బర్మింగ్ హామ్‌లో 2017లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై 8.4 ఓవర్లలో 87 పరుగులు ఇచ్చాడు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌లో షమీ ఎక్కువ వికెట్లు తీస్తాడని అందరూ ఆశించారు. కానీ ఆశించినంత స్థాయిలో వికెట్లు అయితే షమీ తీయలేదు. అయితే ఐదు మ్యాచ్‌లలో షమీ 25.88 సగటుతో వికెట్లు తీయగా.. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడు మ్యాచ్‌లలో 15.11 సగటుతో తొమ్మిది వికెట్లు తీశాడు. ఏది ఏమైనా టీమిండియా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 251/7 స్కోర్ చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట్లో టీమిండియా బ్యాటర్లు బాగానే రాణించినా.. మ్యాచ్ చివరకు వచ్చేసరికి కాస్త ఒత్తిడికి గురయ్యారు. కీలక బ్యాటర్లు రోహిత్, గిల్, కోహ్లీ పెవిలియన్ చేరడంతో బ్యాటర్లతో పాటు ఇండియా ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళన చెందారు. చివరకు భారత్ కివీస్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒక ఓవర్ ఉందనగానే 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు. అయితే భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. గతంలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2002లో గెలిచింది. ఆ తర్వాత 2013లో టీమిండియా గెలవగా మళ్లీ ఇప్పుడు గెలిచింది.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!