Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన

Rohit Sharma:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో పొంగిపోతున్నారు. న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియాను గెలిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ముఖ్యమైనది. నిలకడగా ఆడుతూ 76 పరుగులు చేశాడు. మొత్తం 83 బంతుల్లో 76 పరుగులు చేయగా.. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ వన్డేల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ కూడా రోహిత్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలకు చెక్ పెట్టే ఆన్సర్ రోహిత్ ఇచ్చాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్‌లో కొందరు విలేకర్లు రోహిత్ శర్మను రిటైర్మెంట్ గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ స్పందిస్తూ.. తాను ఇప్పటిలో రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్‌పై వచ్చే వార్తలను నమ్మవద్దు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని చెబుతూ.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తు ప్లానింగ్స్ బట్టి రిటైర్మెంట్ ఉంటుందని తెలిపాడు.
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా రవీంద్ర జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు.అయితే భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. గతంలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2002లో గెలిచింది. ఆ తర్వాత 2013లో టీమిండియా గెలవగా మళ్లీ ఇప్పుడు గెలిచింది. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు బాగానే రాణించారు. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్ శాంట్నర్ (8) పరుగులు చేశారు. నాథన్ స్మిత్ 0 (1) నాటౌట్‌గా ఈ మ్యాచ్‌లో నిలిచాడు. భారత్ బౌలర్లు కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు