Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్

Viral Video:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా ముద్దాడటంతో ఫ్యాన్స్ సంబరాలు చెప్పక్కర్లేదు. ఎంతో ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో టీమిండియా న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మైదానంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దాండియా ఆడుతూ.. విన్నింగ్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 76 పరుగులు చేయగా.. కోహ్లీ మాత్రం ఒక రన్‌కే పెవిలియన్ చేరి ఫ్యాన్స్‌ను నిరాశ పరిచాడు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో చివరకు టీమిండియా విజయం సాధించడంతో అసలు ఆనందానికి అవధుల్లేవు. అయితే విరాట్, రోహిత్‌తో పాటు రవీంద్ర జడేజా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలు కూడా ఆనందంతో మైదానంలో డ్యాన్స్ చేశారు. విన్నింగ్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా జట్టుతో పాటు యావత్తు భారత్ విన్నింగ్ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.
Virat Kohli and Rohit Sharma playing Dandiya with the stumps. 🤣❤️ pic.twitter.com/I1utuReQp2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్ (31) పెవిలియన్ చేరగా విరాట్ కోహ్లీ కేవలం ఒక పరుగుతో తీవ్ర నిరాశ పర్చాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, కేఎల్ రాహుల్ 34* పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్య 18, రవీంద్ర జడేజా 9* పరుగులు చేశారు. చివరగా జడేజా ఫోర్‌తో టీమిండియాను గెలిపించాడు. అయితే భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. గతంలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా 2002లో గెలిచింది. ఆ తర్వాత 2013లో టీమిండియా గెలవగా మళ్లీ ఇప్పుడు గెలిచింది. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
JADEJA RECREATED THIS WITH ARSHDEEP AND HARSHIT. 🥺🇮🇳 pic.twitter.com/kqsbtuHhqp
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ బ్యాటర్లు బాగానే రాణించారు. డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (53*) పరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34), విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లేథమ్ (14), మిచెల్ శాంట్నర్ (8) పరుగులు చేశారు. నాథన్ స్మిత్ 0 (1) నాటౌట్‌గా ఈ మ్యాచ్‌లో నిలిచాడు. భారత్ బౌలర్లు కుల్‌దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ తీశారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!