Cricket rule for highest runs: క్రికెట్లో అత్యధికంగా ఎన్ని పరుగులు పరుగెత్తవచ్చో మీకు తెలుసా?

Cricket rule for highest runs: క్రికెట్లో సాధారణంగా బ్యాటర్లు 1, 2, లేదా 3 పరుగులు పరుగెత్తడం మనం తరచుగా చూస్తుంటాం. కొన్నిసార్లు బంతి ఓవర్ థ్రో అయినప్పుడు లేదా ఫీల్డర్లు పొరపాటు చేసినప్పుడు బ్యాటర్లు 4 పరుగులు కూడా తీస్తారు. అయితే క్రికెట్లో గరిష్టంగా ఎన్ని పరుగులు పరుగెత్తవచ్చా.. లేకపోతే నాలుగు వరకు మాత్రమే పరిగెత్తాలా అనే ప్రశ్న చాలా మందిలో మొదలు అవుతుంది. చాలా మందికి ఈ నియమాల గురించి సరిగ్గా తెలియదు. అయితే క్రికెట్లో బ్యాటర్లు ఒక్కసారిగా ఎన్ని పరుగులు తీయవచ్చు? దీని రూల్ ఏంటి? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో చూద్దాం.
క్రికెట్ రూల్స్ ప్రకారం బంతి వికెట్ కీపర్ దగ్గరకు వచ్చే వరకు ఎన్నిసార్లు అయినా పరిగెత్తవచ్చు. ఫీల్డింగ్ జట్టు బంతిని తిరిగి బౌలర్ లేదా వికెట్ కీపర్‌కు వచ్చే వరకు రూల్ ఉంటుంది. అయితే గరిష్టంగా ఇన్ని పరుగులు చేయాలనే రూల్ అయితే లేదు. బ్యాటర్ 100 పరుగుల వరకు కూడా చేయవచ్చు. అయితే వంద పరుగులు అనేది అసాధ్యం. ఎందుకంటే ఫీలర్డర్లు చాలా అలర్ట్‌గా ఉంటారు. రెండు లేదా నాలుగు పరుగులు చేయడం కూడా కొన్నిసార్లు కష్టమే. వారు వెంటనే బాల్‌ను వికెట్ కీపర్‌కు ఇస్తారు. ఇంకా అన్ని పరుగులు ఇచ్చే అవకాశం ఉండదు. నిజానికి బాల్ బౌండరీలు దాటితే ఎక్కువ పరిగెత్తే అవకాశం ఉండదు. ఎందుకంటే బౌండరీ దాటితో ఫోర్‌గా కౌంట్ చేస్తారు. అయితే ఫీల్డర్లు కొన్ని తప్పులు చేయడం వల్ల కొన్నిసార్లు 4, 5, 6 పరుగులు కూడా నమోదయ్యాయి.
1894లో విక్టోరియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో బ్యాటర్లు ఒక బంతికి ఏకంగా 286 పరుగులు పరుగెత్తారని అంటుంటారు. అయితే ఆ మ్యాచ్‌లో ఒక బ్యాటర్ బంతిని కొట్టగా, అది ఒక చెట్టులో ఇరుక్కుపోయిందట. బంతి స్పష్టంగా కనిపించినప్పటికీ, దానిని తీయడానికి వీలు కాకపోవడంతో ఫీల్డింగ్ జట్టు బంతిని కోల్పోయినట్లు ప్రకటించమని అంపైర్‌ను కోరిందట. కానీ అంపైర్ అందుకు అంగీకరించకపోవడంతో ఫీల్డర్లు ఆ బంతిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాటర్లు వికెట్ల మధ్య పరుగెత్తుతూనే ఉన్నారట. ఇలా బంతిని తిరిగి తెచ్చే సరికి వారు 286 పరుగులు తీశారని కొన్ని చెబుతున్నాయి.
టెస్ట్ క్రికెట్లో ఒక బంతికి 8 పరుగులు వచ్చాయి. ఓవర్ థ్రో వల్ల లభించాయి. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ 8 పరుగులు ఒకే బంతికి చేశాడు. 2008లో మొదట 4 పరుగులు పరుగెత్తాడు. ఆ తర్వాత బంతి ఓవర్ థ్రో అయ్యి బౌండరీ దాటడంతో 4 పరుగులు లభించాయి. అయితే 1929లో పాట్సీ హెండ్రెన్, 1980లో జాన్ రైట్, 2008లో ఆండ్రూ సైమండ్స్ ఒక బంతికి ఎనిమిది పరుగులు చేశారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Jadeja: ఫైనల్స్‌కి ముందు టీమిండియాకి బిగ్ షాక్.. చిక్కులో జడేజా!
-
Steve Smith: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. టీమిండియాతో ఓటమే కారణమా?
-
Viral Video: టీమిండియా ఘన విజయం.. విరాట్, అనుష్క క్యూట్ వీడియో వైరల్
-
Champions Trophy: టీమిండియాతో కంగారు మ్యాచ్.. టెన్షన్ మనకు కాదు.. ఆస్ట్రేలియాకే.. కారణమేంటి?