Viral Video: టీమిండియా ఘన విజయం.. విరాట్, అనుష్క క్యూట్ వీడియో వైరల్

Viral Video:
ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలవడంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇండియాను గెలిపించడంలో కోహ్లీ పాత్ర ఉంది. విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలోకి వెళ్తుండగా ఔట్ అయ్యాడు. కానీ టీమిండియా స్కోర్ చేసిన 265 పరుగుల్లో కోహ్లీ స్కోర్ ఎక్కువగా ఉంది. అయితే ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత కింగ్ కోహ్లీ ఆ సంతోషాన్ని తన సతీమణి అనుష్కతో పంచుకున్నారు. సాధారణంగా వీరిద్దరూ ఎప్పుడూ కూడా మ్యాచ్ సమయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. ఇప్పుడు కూడా మ్యాచ్ గెలిచిన ఆనందాన్ని తనతో పంచుకున్నాడు. దూరంలో ఉన్నా కూడా గెలిచామనే ఆనందాన్ని తన భార్యతో పంచుకున్నాడు. దూరంగా కోహ్లీ నిల్చోని తన భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ.. మేం మ్యాచ్ గెలిచామని కళ్లతో చెప్పాడు. ఆమె చప్పట్లు కొట్టింది. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఆ సమయంలో కూడా అనుష్క ఇన్‌స్టా స్టోరీ షేర్ చేసింది.
Virat Kohli's reaction to Anushka Sharma after the Victory🥹🧿❤️ pic.twitter.com/wKCG9beLgX
— Virat Kohli Fan Club (@Trend_VKohli) March 4, 2025
ఇదిలా ఉండగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌లో భారత్ ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగులతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సిక్సర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇండియా గెలవడంలో విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. ఐదోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరింది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ కంగారుల చేతిలో ఓడిపోయింది. దీనికి ప్రతీకారంగా భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియను చిత్తుగా ఓడించింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ పడతాదని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 34, హర్దిక్ పాండ్య 28, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభమన్ గిల్ 8 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు ఆడమ్ జంపా 2 వికెట్లు తీశాడు. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లి్ష్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ తీశారు.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!