Jadeja: ఫైనల్స్‌కి ముందు టీమిండియాకి బిగ్ షాక్.. చిక్కులో జడేజా!

Jadeja:
సరదాగా ఉండటం మంచిదే.. కానీ కొన్నిసార్లు మనం సరదాకి చేసిన పనులు చిక్కుల్లో పెడుతుంది. అయితే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో కూడా ఇలానే జరిగింది. సరదాగా చేసిన ఒక పని సమస్యను తెచ్చిపెట్టింది. ఏమైందంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్ ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ సమయంలో జడేజా సరదాగా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ జరుగుతున్నప్పుడు 21వ ఓవర్ వేసేందుకు జడేజా రెడీగా ఉన్నాడు. ఆ సమయంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు సీనియర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ కూడా క్రీజులో ఉన్నాడు. జడేజా వేసిన బంతిని స్టీవ్ స్మిత్ ఎదురుగా కొట్టాడు. ఇది నాన్ స్ట్రయికర్ లబుషేన్ బ్యాట్‌కు తగిలి ఉండేది. ఆ బాల్ తగులుతుంది ఏమోనని లబుషేన్‌ను జడేజా గట్టిగా పట్టుకున్నాడు.
లబుషేన్ రన్ తీయకుండా చేశాడు. అయితే రన్ చేయకూడదనే ఉద్దేశంతో జడేజా ఇలా చేయలేదు. బాల్ తగులుతుందని ఆపాడు. ఇది కాస్త నవ్వుకుని చేయడంతో కాస్త వైరల్ అయ్యింది. లబుషేన్ లైట్ తీసుకున్న స్మిత్ మాత్రం లైట్ తీసుకోలేదు. రన్ తీయకుండా ఆపడం ఏంటని జడ్డూపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఐసీసీ రూల్స్ ప్రకారం ఉద్దేశపూర్వకంగా బౌలర్ బ్యాటర్‌ను అడ్డుకుంటే నేరం. తప్పు చేసినట్లు తేలితే.. జరిమానా విధించడం లేదా మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇంకా ఉంది. ఈ సమయంలో ఇలా జరగడం టీమిండియాకి కాస్త ఆందోళనగా ఉంది. మరి ఆస్ట్రేలియా జట్టు కంప్లైంట్ ఇస్తుందో లేదో చూడాలి.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో మొదటి సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడగా.. టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు రెండో సెమీ ఫైనల్‌లో తలపడగా ఇందులో న్యూజిలాండ్ గెలిచింది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ను భారత్ చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగులతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సిక్సర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు.
Steve Smith is unhappy about Jadeja forcefully hugging Marnus Labuschagne 😂 pic.twitter.com/OyW7G5igZm
— GBB Cricket (@gbb_cricket) March 4, 2025
-
Pujara And Jadeja: జడేజా పై విమర్శలు.. పుజారా కౌంటర్
-
Joe Root : లార్డ్స్‌లో రాహుల్ ద్రావిడ్‌ను దాటేసిన జో రూట్.. సెంచరీతో సరికొత్త రికార్డు
-
Cricket rule for highest runs: క్రికెట్‌లో అత్యధికంగా ఎన్ని పరుగులు పరుగెత్తవచ్చో మీకు తెలుసా?
-
Ravindra Jadeja: రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన జడేజా.. నాలుగు పదాలతో పుకార్లకు చెక్ పెట్టేశాడుగా!
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?