Pujara And Jadeja: జడేజా పై విమర్శలు.. పుజారా కౌంటర్
Pujara And Jadeja టెయిలెండర్లు ఇంకాస్త బాగా బ్యాటింగ్ చేసి ఉండి. టార్గెట్ కు చేరువుగా వచ్చినప్పుడు ఛాన్స్ తీసుకోవాలని జడేజా భావించి ఉంటాడు. ఈ మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ చాలా బాగుంది.

Pujara And Jadeja: జడేజా పై విమర్శలు చేస్తున్నా వారిపై పుజారా కౌంటర్ ఇచ్చాడు. జడేజా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడని కాస్త ముందుగానే షాట్లు కొట్టడం ప్రారంభించి ఉంటే బాగుండేదని.. అఖరి బ్యాటర్లకు ఫేసింగ్ ఇవ్వకుండా ఉండాల్సిందని భారత్ కు చెందిన మాజీ క్రికెటర్లు పలువురు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పుజారా స్పందించాడు. ఇలాంటి పిచ్ పై జడేజా వేగంగా పరుగులు చేయలేదు. కారణం బంతి సాఫ్ట్ గా మారడంతో పాటు పిచ్ మందకొడిగా ఉంది.
టెయిలెండర్లు ఇంకాస్త బాగా బ్యాటింగ్ చేసి ఉండి. టార్గెట్ కు చేరువుగా వచ్చినప్పుడు ఛాన్స్ తీసుకోవాలని జడేజా భావించి ఉంటాడు. ఈ మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ చాలా బాగుంది. నాలుగో ఇన్నింగ్స్ లో ఇలాంటి పిచ్ పై పరుగులు చేయడం చాలా కష్టం. గత ఐదేళ్లుగా జడేజా ఆటతీరు మెరుగుపడింది. లార్డ్స్్ మ్యాచ్ సమయంలోనూ నెట్ ప్రాక్టీస్ చేసిన విషయాన్ని మనం గుర్తించాలి. పేస్ ను ఎదర్కొనేటప్పుడు చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపించింది. అద్భుత నైపుణ్యాలు లేకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 300 స్కోర్లను చేయలేరు అని పుజరా అన్నాడు.
Fight mode: ON ⚔#RavindraJadeja isn’t here to survive he’s here to dominate.#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJKZ4E pic.twitter.com/TdYhxtz7lH
— Star Sports (@StarSportsIndia) July 14, 2025