Champions Trophy: టీమిండియాతో కంగారు మ్యాచ్.. టెన్షన్ మనకు కాదు.. ఆస్ట్రేలియాకే.. కారణమేంటి?

Champions Trophy:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ వచ్చేస్తుంది. సెమీస్‌లో ఏయే జట్లు తలపడనున్నాయో క్లారిటీ వచ్చేసింది. గ్రూప్ ఏ లో భాగం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే మార్చి 4వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ రెండ్లు జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. అయితే సాధారణంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ఇండియా కాస్త ఆలోచించాలి. కానీ టీమిండియాతో మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా కాస్త కంగారుగా ఉంది. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులోని కీలక బౌలర్లు దూరమయ్యారు. స్టార్క్, కమిన్స్, హేజల్ వుడ్ ఆస్ట్రేలియా జట్లు లేకపోవడంతో కాస్త ఆందోళన చెందుతుంది. ఎందుకంటే వీరు ముగ్గురు బౌలింగ్‌లో టాప్. అందులోనూ ప్యాట్ కమిన్స్ అయితే ఆల్‌రౌండర్. వీరు ముగ్గురు కూడా ఒకేసారి జట్టులో లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు కాస్త టెన్షన్ చెందుతుంది. ఈ ముగ్గురు లేకుండా ఆస్ట్రేలియా, భారత్ సెమీస్‌లో తలపడనున్నాయి. వీరు ముగ్గురే కాకుండా ట్రావిస్ హెడ్ కూడా సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆడకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా ట్రావిస్ సెమీస్‌లో ఉండకపోవచ్చు. అయితే రెండో సెకండ్ సెమీస్ మార్చి 5న జరగనుంది. ఇందులో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ సెమీ ఫైనల్‌లో గెలిచిన జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తలపడి.. ట్రోఫీని ఏదో ఒక జట్టు సొంతం చేసుకుంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టు మూడు మ్యాచుల్లో గెలిచింది. దీంతో గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉంది. గ్రూప్ బీలో దక్షిణాఫ్రికా జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యా్చ్‌లలో గెలిచింది.
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం జరిగింది. గ్రూప్ ఎ దశలో మ్యాచ్‌లు జరగ్గా.. ఇప్పటికే పాక్, బంగ్లాదేశ్ నిష్క్రమించాయి. అయితే దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ మీద విజయం సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొత్తం 44 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో 249 పరుగులు చేసింది. 250 టార్గెట్ దిగిన న్యూజిలాండ్ జట్టు 45.3 ఓవర్లలో 205 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మొదటి మూడు మ్యాచ్‌లలో విజయం సాధించిన న్యూజిలాండ్ భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో భారత్ సెమీ ఫైనల్‌కి చేరింది. వరుసగా భారత్ విజయాలు సాధించి సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. న్యూజిలాండ్ ఓడిపోయి గ్రూప్ ఎలో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ బీలో టాప్‌లో ఉన్న దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్