Steve Smith: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్.. టీమిండియాతో ఓటమే కారణమా?

Steve Smith:
ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిపోయిన కొన్ని గంటల్లోనే స్మిత్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా, భారత్‌కి మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో స్మిత్ 73 పరుగులు చేశాడు. భారత్‌తో ఓటమిని చవి చూసిన తర్వాత స్మిత్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు స్మిత్ 170 వన్డే మ్యాచ్‌లు ఆడగా అందులో 5800 పరుగులు చేశాడు. మొత్తం 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలను వన్డేల్లో నమోదు చేశాడు. అయితే స్మిత్ కేవలం వన్డే మ్యాచ్‌లకు మాత్రమే రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఇకపై టెస్ట్ క్రికెట్, టీ20 ఫార్మాట్స్‌లో కొనసాగనున్నట్లు ప్రకటించాడు. అయితే వన్డే్ల్లో రెండు వరల్డ్ కప్స్ గెలిచానని, వాటితో ఎన్నో జ్ఞాపకాలు దాచుకున్నానని స్మిత్ తెలిపాడు. వన్డే ఫార్మాట్‌లో ఆడన ప్రతీ మ్యాచ్ కూడా తనకి ఓ మధుర జ్ఞాపకమని తెలిపాడు. అయితే ఇలా రిటైర్‌మెంట్ ఒక్కసారి ప్రకటించడంతో.. టీమిండియాతో ఓటమే కారణమని అంటున్నారు. అసలు వన్డేల్లో రిటైర్‌మెంట్ చెప్పడానికి గల కారణమేంటనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌లో ఆసీస్‌ను భారత్ చిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 264 పరుగుల వద్ద ఆలౌటైంది. 265 పరుగులతో బరిలోకి దిగిన భారత్ జట్టు 48.1 ఓవర్లలో 265 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సిక్సర్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇండియా గెలవడంలో విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. ఐదోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరింది. అయితే 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ కంగారుల చేతిలో ఓడిపోయింది. దీనికి ప్రతీకారంగా భారత్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియను చిత్తుగా ఓడించింది. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ పడతాదని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 34, హర్దిక్ పాండ్య 28, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27, శుభమన్ గిల్ 8 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లు ఆడమ్ జంపా 2 వికెట్లు తీశాడు. బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లి్ష్, కూపర్ కనోలీ ఒక్కో వికెట్ తీశారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ ఆడింది. సౌత్ ఆఫ్రికా, ఆఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఆ తర్వాత సెమీ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓడిపోయింది.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందంటే?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్