Bengaluru Stampede Tragedy: మీరు మారరా.. తొక్కిసలాటపై మండిపడుతున్న నెటిజన్లు

Bengaluru Stampede Tragedy: జనం గుమిగుడితే చాలు ప్రజలు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. అప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్, మొక్క మహా కుంభమేళా, ఇప్పుడు ఆర్సీబీ విక్టరీ. ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు విజేతగా నిలవడంతో బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవం నిర్వహించారు. దీనికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వెళ్లడంతో ఒక్కసారి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కసలాటలో 11 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయాల పాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. బయట ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నా కూడా లోపల మాత్రం విజయోత్సవ కార్యక్రమం జరుగుతూనే ఉంది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. దేశంలో తొక్కసలాటలు జరగడం ఇదేం మొదటిసారి కాదు. గతేడాది పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంథ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఓ మహిళ మృతి చెందడంతో పాటు పలువురు తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఆ తర్వాత ఈ ఏడాది మహా కుంభమేళా జరిగింది. ఇందులో కూడా దాదాపుగా 30 మంది మృతి చెందారు. అసలు ప్రభుత్వం సరిగ్గా ప్రణాళికలు వేసుకోదా? ప్రజలకు భద్రత కల్పించదా? సామాన్యుల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతుందని నెటిజన్లు మండి పడుతున్నారు. వరుస తొక్కిసలాటలు, బలి అవుతున్న సామాన్యలు అని నెటిజన్లు సోషల్ మీడియాలో దువ్వెర పోస్తున్నారు.
Read Also:Spiritual Practice : ఆత్మను పరమాత్మతో కలిపే సాధన.. ప్రతి రోజు జపం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
గతంలో అల్లు అర్జున్ తొక్కిసలాట సమయంలో థియేటర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఆర్సీబీ విషయంలో అదే జరిగింది. బయట అంత తొక్కిసలాట జరగుతుందో స్టేడియం లోపల మాత్రం కోహ్లీతో పాటు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ కూడా సామాన్య ప్రజలు ప్రాణాలు బలి అవుతున్నారని మండి పడుతున్నారు. ఆర్సీబీని చూడటానికి భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. ఈ జనాలన్ని కర్ణాటక ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా స్టేడియం గేట్లు ఓపెన్ చేయడంతో తొక్కిసలాట జరిగి సామాన్య ప్రజలు బలి అయ్యారు. ఈ ఘటనపై నెటిజన్లు మండి పడుతున్నారు.
-
RCB Stampede: ఆర్సీబీ తొక్కిసలాట.. రిపోర్టు లో సంచలన విషయాలు
-
IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Bengaluru Stampede : బెంగళూరు విషాద ఘటన..కేఎస్‌సీఏ కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరాం రాజీనామా
-
Arrest Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ట్రెండింగ్‌లో #ArrestKohli
-
Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట.. అప్పుడు అల్లు అర్జున్.. మరి ఇప్పుడు విరాట్ కోహ్లీ అరెస్ట్ ?
-
Bengaluru Stampede Tragedy: బెంగుళూరు తొక్కిసలాట మరణాల వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే !