Spiritual Practice : ఆత్మను పరమాత్మతో కలిపే సాధన.. ప్రతి రోజు జపం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

Spiritual Practice : ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న వారికి జపం (Japa) ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనంగా ఉపయోగపడుతుంది. కేవలం మాటలను పదేపదే పలకడం మాత్రమే కాదు, ఇది ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక గొప్ప ప్రక్రియ. కృతయుగం నుండి కలియుగం వరకు జపం తన ప్రాముఖ్యతను నిలుపుకుందని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత జపం చేస్తే దాని ప్రభావం మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు.
జపం చేయడానికి ప్రధానంగా మూడు పద్ధతులు ఉన్నాయి:
వాచిక జపం (Vachika Japa): ఈ పద్ధతిలో జపాన్ని బిగ్గరగా, స్పష్టంగా పలుకుతారు. ఇది జపం చేసేవారికి, చుట్టుపక్కల వారికి మంత్ర ధ్వనిని అందిస్తుంది.
ఉపాంశు జపం (Upanshu Japa): ఇందులో పెదవులు మాత్రమే కదులుతాయి..కానీ శబ్దం బయటకు రాదు. ఇది వాచిక జపం కంటే ఎక్కువ ఏకాగ్రతను కోరుతుంది.
మానసిక జపం (Manasika Japa): ఈ పద్ధతిలో జపాన్ని మనసులోనే పదేపదే ధ్యానిస్తారు. ఇది అత్యంత సూక్ష్మమైన, శక్తివంతమైన జప పద్ధతి.
Read Also:Pawan Kalyan: ఇదిరా పవర్ స్టార్ అంటే.. రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన పవన్
భగవద్గీతలో (Bhagavad Gita) శ్రీకృష్ణుడు జప యజ్ఞం (Japa Yajna) ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. జపం చేసే ప్రదేశం కూడా చాలా ముఖ్యం. పరిశుభ్రమైన ప్రదేశంలో దేవాలయం (Temple) పక్కన, అశ్వత్థ వృక్షం (Ashvattha Tree) కింద లేదా గణపతి దేవాలయం (Ganapati Temple) దగ్గర జపం చేయడం మంచిదని నిపుణులు సూచించారు.
జపం చేసేటప్పుడు నేలపై నేరుగా కూర్చోకూడదు. పద్మాసనం లేదా సుఖాసనంలో ఒక చాప (Mat) పైన లేదా బల్ల (Table) పైన కూర్చుని జపం చేయడం ఉత్తమం. అంగుష్ట (బొటన) వేలు, మధ్య వేలు (Middle Finger), అనామిక (ఉంగరపు వేలు – Ring Finger) ఉపయోగించి జపమాల (Japamala) తిప్పాలి. తర్జని (చూపుడు వేలు – Index Finger)ని జపానికి ఉపయోగించకూడదని సూచించారు.
Read Also:Cancer: గ్లోబల్ వార్మింగ్‌తో.. క్యాన్సర్‌కు ఏదైనా సంబంధం ఉందా?
జపం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:
జపం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, ఇది శారీరక (Physical), మానసిక (Mental) ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఏకాగ్రత అభివృద్ధి: జపం ఏకాగ్రతను (Concentration) పెంచుతుంది. ఇది మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది.
ఆలోచనా శక్తి పెరుగుదల: జపం ఆలోచనా శక్తిని (Thinking Power) పెంచుతుంది. స్పష్టమైన ఆలోచనలను ప్రోత్సహిస్తుంది.
ఆయుష్షు, బలం: ఇది ఒక రకమైన శారీరక వ్యాయామంలా పని చేస్తుంది. ఇది ఆయుష్షును (Life Expectancy), బలాన్ని (Strength) పెంచుతుంది.
దీర్ఘకాలిక ప్రయోజనాలు: రోజుకు కొన్ని నిమిషాలు జపం చేయడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయి, ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
-
Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం
-
Astrology: శని, బుధుల ప్రభావం.. ధనవంతులు అయ్యే రాశులివే
-
Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు
-
Numerology: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
-
Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు
-
Zodiac Signs: వీళ్ల మొదటి పెళ్లి పెటాకులు.. రెండో పెళ్లయ్యే రాశుల వారు వీరే.