Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Entertainment News »
  • Pawan Kalyan Give Back Remunaration Hari Hara Veera Mallu Producer

Pawan Kalyan: ఇదిరా పవర్ స్టార్ అంటే.. రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన పవన్

Pawan Kalyan: ఇదిరా పవర్ స్టార్ అంటే.. రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన పవన్
  • Edited By: kusuma,
  • Updated on June 4, 2025 / 07:39 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Pawan Kalyan: పవర్ స్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండటంతో పాటు సినిమా షూటింగ్‌లో కూడా బిజీ బిజీగా ఉంటున్నాడు. పవన్ హీరోగా నటించిన హరి హర వీర మల్లు సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. డిప్యూటీ సీఎంగా వర్క్ చేస్తూ, షూటింగ్‌లో పాల్గొంటూ సినిమాను కంప్లీట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ అంటే మంచికి, సాయానికి మారు పేరు. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ సాయం చేస్తాడు. అయితే పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్‌ను తిరిగి ఇచ్చేశారు.

ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ ఎన్నికలు, ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటం వల్ల షూటింగ్ పూర్తి కాలేదు. ఈ సినిమా ఫిక్స్ అయి చాలా ఏళ్లు పట్టింది. అయితే ఈ సినిమా కోసం నిర్మాత ఏయం రత్నం పవన్ కళ్యాణ్‌కి అడ్వాన్స్‌గా రూ.11 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత సినిమా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చినా కూడా నిర్మాత ఆ డబ్బులను అయితే అడగలేదు. దీంతో నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ రూ.11 కోట్లను వెనక్కి తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా జూన్ 12 న విడుదల కాదని, వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ కాలేదని తెలుస్తుంది.

ఇది కూడా చూడండి:IPL 2025 Final: ఐపీఎల్‌ ఫైనల్.. గెలిచిన జట్టుకు భారీ ప్రైజ్ మనీ!

పవన్ కళ్యాణ్ సాయం చేయడంలో ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. ఎవరికి అయినా కూడా సాయం చేస్తుంటారు. తన దగ్గర లేకపోయినా కూడా ఏదో రకంగా హెల్ప్ చేసే గుణం ఉంది. అందులోనూ తన సినిమా అంటే క్వాలిటీ కోసం ఎంతైనా కూడా చేస్తారు. ‘తొలిప్రేమ’లోని పాటలో తాజ్ మహల్ సెట్ వేయడం కోసం డబ్బులు ఇచ్చారు. ‘తీన్‌మార్’ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో పవన్ ప్రొడ్యూస్ చేయాలనుకున్న ‘గబ్బర్ సింగ్’ మూవీను బండ్ల గణేష్‌కి ఇచ్చారు. ఇప్పుడు మరోసారి పవన్ తన మంచి మనస్సు చాటుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్, నిర్మాత ఏయం రత్నం మధ్య మంచి బాండింగ్ ఉంది. పవన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ ఇచ్చిన ‘ఖుషి’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. ఖుషి మూవీ లాగే హరి హర వీర మల్లు కూడా మళ్లీ హిట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tag

  • AM Ratnam
  • Hari Hara Veera Mallu
  • Pawan Kalyan
  • remuneration
Related News
  • Hari Hara Veera Mallu Movie Postponed: పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. మరోసారి సినిమా వాయిదా

  • Prabhas :’ది రాజా సాబ్’ కోసం రూ.50కోట్లు రెమ్యునరేషన్ తగ్గించుకున్న ప్రభాస్ ? అసలు కారణం ఇదే!

  • Pawan Kalyan shocking look in OG: ఓజీ లో పవన్ కళ్యాణ్ షాకింగ్ లుక్.. లీక్డ్ వీడియో వైరల్

  • Pawan Kalyan son Mark Shankar: ప్రమాదం నుంచి బయటపడిన పవన్ కుమారుడు మార్క్ శంకర్.. ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే?

  • Pawan Kalyan: ఒక్క వార్నింగ్‌తో టాలీవుడ్‌ను కాళ్ల బేరానికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్

  • Nayanthara: మెగా 157లో నయనతార తీసుకునే రెమ్యూనరేషన్ ఇంత తక్కువనా!

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us