Ambati vs Police : నువ్వెంత అంటే నువ్వెంత.. అంబటిని ఇచ్చి పడేసిన సీఐ!

Ambati vs Police : ఏపీలో( Andhra Pradesh) పోలీసులు వెనక్కి తగ్గడం లేదు. విధి నిర్వహణలో అస్సలు లెక్కచేయడం లేదు. ముఖ్యంగా శాంతిభద్రతల పర్యవేక్షణలో తమదైన శైలిలో వారు స్పందిస్తున్నారు. అయితే అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అతిని అదే స్థాయిలో స్పందిస్తున్నారు ఏపీ పోలీసులు. మొన్నటికి మొన్న ఓ సీఐ మాజీమంత్రి విడదల రజినీకి చుక్కలు చూపించారు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న తన పిఏను వాహనంలో దాచారు. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ సీఐపై దురుసుగా ప్రవర్తించారు మాజీ మంత్రి రజిని. తాను ఒక మాజీ మంత్రిని అని గుర్తు చేస్తూ సిఐని పేరు పెడుతూ హెచ్చరికలు జారీ చేశారు. సదరు సిఐ కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరకు వాహనంలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై భిన్న స్వరాలు వినిపించాయి. మాజీ మంత్రి రజినిపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబును ఓ పోలీస్ అధికారి ఇచ్చిపడేశారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి అద్భుత విజయం సాధించింది. అయితే ఈ ఏడాది కాలంలో ఎన్నికల హామీలు అమలు చేయలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినాన్ని నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేశాయి. కలెక్టరేట్ల ముందు నిరసన తెలుపుతూ వినతి పత్రాలు అందించాయి. అందులో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలు జరిపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పుడే మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను నిలదీసినంత పనిచేశారు. అయితే అదే సమయంలో పోలీసులు సైతం వెనక్కి తగ్గలేదు.
* గుంటూరులో రభస
అంబటి రాంబాబు( ambati Rambabu) నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలెక్టరేట్ వైపు చొచ్చుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబటి రాంబాబు ఒక్కసారిగా రెచ్చిపోయారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న సిఐ వెంకటేశ్వర్లు అంబటి రాంబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు సైతం కేకలు వేశారు. అయితే సిఐ వెంకటేశ్వర్లు వెనక్కి తగ్గలేదు. ఒకానొక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో పరస్పరం హెచ్చరించుకున్నారు. ర్యాలీతో కలెక్టరేట్ కు వెళ్లి తీరుతాం.. అడ్డుకో చూద్దాం అంటూ అంబటి రాంబాబు సదరు సిఐని హెచ్చరించారు. అయితే ఎలా ర్యాలీ చేస్తావో చూస్తా అంటూ గట్టిగానే హెచ్చరించారు సిఐ వెంకటేశ్వరరావు. దాదాపు పావు గంటసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అచ్చం సినిమాల మాదిరిగా.. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఇచ్చి పడేశారు సీఐ వెంకటేశ్వరరావు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!
-
Hari hara veera mallu movie: హరి హర వీర మల్లుకు బిగ్ షాక్.. విడుదల కష్టమే!
-
Rashmika : మరో వివాదంలో చిక్కుకున్న రష్మిక మందన్నా.. ఇంతకీ అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ?
-
Duvvada Srinivas warns YCP Leaders: ఆ ముగ్గురి జాతకం దువ్వాడ శ్రీనివాస్ చేతిలో!
-
Vijay Deverakonda : రాజుకున్న ‘రెట్రో’ వివాదం.. విజయ్ దేవరకొండ పై కేసు నమోదు
-
Jagan on Rayachoti constituency: నమ్మకస్తుడైన నేతను పక్కన పెడుతున్న జగన్!