Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Andhra Pradesh News »
  • Duvvada Srinivas Warns These Three Ycp Leaders

Duvvada Srinivas warns YCP Leaders: ఆ ముగ్గురి జాతకం దువ్వాడ శ్రీనివాస్ చేతిలో!

Duvvada Srinivas warns YCP Leaders: 2019లో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆపై మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. అటువంటి దువ్వాడ శ్రీనివాస్ కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. దివ్వెల మాధురితో ఆయన వ్యవహారాన్ని కారణంగా చూపి పార్టీ నుంచి వేటు వేశారు.

Duvvada Srinivas warns YCP Leaders: ఆ ముగ్గురి జాతకం దువ్వాడ శ్రీనివాస్ చేతిలో!
  • Edited By: NARESH ENNAM,
  • Updated on June 23, 2025 / 02:16 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Duvvada Srinivas warns YCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించిన సమయంలో స్వచ్ఛందంగా ఆయన వెంట అడుగులు వేసిన నాయకుడు కూడా. ఒక విధంగా చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో జగన్ వెంట నడిచిన తొలి నాయకుడిగా దువ్వాడ శ్రీనివాస్ గుర్తింపు పొందారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ ఆ జిల్లా నేతలతో సఖ్యత లేకపోయినా ఛాన్స్ ఇచ్చారు జగన్. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. 2019లో ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆపై మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. అటువంటి దువ్వాడ శ్రీనివాస్ కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురయ్యారు. దివ్వెల మాధురితో ఆయన వ్యవహారాన్ని కారణంగా చూపి పార్టీ నుంచి వేటు వేశారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పై తనకు ఎటువంటి కోపం లేదని.. తనను ఆ పార్టీ నుంచి దూరం చేసింది ఆ ముగ్గురు అని.. వారి జాతకాలు తన వద్ద ఉన్నాయని సంచలన కామెంట్స్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. వారి వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని.. అవసరం అయినప్పుడు బయట పెడతానని హెచ్చరిస్తున్నారు.

* ఆ ముగ్గురిని వదలనని హెచ్చరిక
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. మంత్రులుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు సైతం ఓటమిపాలయ్యారు. సీనియర్ నేతగా ఉన్న ధర్మాన కృష్ణ దాస్ సైతం ఓడిపోయారు. అయితే తనను పార్టీ నుంచి దూరం చేసింది ఈ ముగ్గురే అంటూ బహిరంగంగానే చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇందులో ధర్మాన ప్రసాదరావును ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు దువ్వాడ. కృష్ణదాస్ విషయంలో కొద్ది రోజులపాటు సఖ్యత గానే ఉండేవారు. అప్పలరాజు విషయంలో విభేదాలు రావడానికి కారణం దువ్వాడ సోదరులు. తన ఓటమికి దువ్వాడ సోదరులు పనిచేశారని అప్పలరాజులో అసహనం ఉంది. అందుకే ఆయన దువ్వాడ శ్రీనివాసును టార్గెట్ చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ముగ్గురు నేతలు పట్టుబట్టి దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెండ్ చేసేలా.. పావులు కదిపారన్నది బహిరంగ రహస్యం. అందుకే ఈ ముగ్గురు నేతల వ్యక్తిగత జీవితాన్ని బయటపెడతానని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిస్తుండడం విశేషం.

Also Read: China Ban : చైనా దెబ్బకు భారత్ లో ప్రమాదంలో 21,000ఉద్యోగాలు

* దూకుడు కలిగిన నేత..
దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) దూకుడు స్వభావం కలిగిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. కింజరాపు కుటుంబంతో తలపడుతూ వచ్చారు. కానీ ఒక్కసారి కూడా ఆయనకు గెలుపు దక్కలేదు. అయితే ఈ విషయంలో ధర్మాన సోదరుల సహాయ నిరాకరణ దువ్వాడ శ్రీనివాస్ కు శాపంగా మారిందన్న కామెంట్స్ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం వీచింది. శ్రీకాకుళం జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. టెక్కలి, ఇచ్చాపురం అసెంబ్లీ స్థానాలు మాత్రం టిడిపి కైవసం చేసుకుంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని సైతం టిడిపి నిలబెట్టుకుంది. దువ్వాడ శ్రీనివాస్ పై పోటీ చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు. అయితే దీని వెనుక ధర్మాన సోదరుల హస్తం ఉందన్నది దువ్వాడ శ్రీనివాస్ శిబిరం నుంచి వినిపించిన మాట. అసలు కింజరాపు సోదరుల వెనుక ఉన్నది ధర్మాన సోదరులు అంటూ సంకేతాలు పంపగలిగారు దువ్వాడ శ్రీనివాస్.

Also Read: Viral Video: ఈ వర్షం సాక్షిగా అంటూ డ్యాన్స్ చేద్దాం అనుకుంది.. పాపం బొక్కబోర్లా పడింది

* ఫ్యామిలీ ఎపిసోడ్ ను చూపుతూ
అయితే దువ్వాడ శ్రీనివాస్ కు జిల్లాలో ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ). అందుకే సొంత పార్టీలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ధర్మాన సోదరులతో పాటు అప్పలరాజు వ్యూహం పన్నారు. అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ ఎపిసోడ్ నడిచింది. మధ్యలో దివ్వెల మాధురి ఎంట్రీ తో దువ్వాడ ప్రత్యర్థులకు కలిసి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ వైఖరితో పార్టీకి నష్టం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి శ్రీకాకుళం జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి గురికాక తప్పలేదు. ఇప్పటికే పార్టీ కష్టాల్లో ఉండడంతో జగన్ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని చెబుతూ వచ్చారు దువ్వాడ. ఆ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో వదలను అని.. వారి జాతకం తన వద్ద ఉందని.. అవసరం అయినప్పుడు బయట పెడతానని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tag

  • AP Latest News
  • ap politics
  • Duvvada Srinivas
  • harmana prasad
  • sidiri appala raju
Related News
  • Pawan Kalyan AP CM: ఏపీ సీఎంగా పవన్ కళ్యాణ్?!

  • Pawan Kalyan leaves Cabinet Meeting: క్యాబినెట్ భేటీ నుంచి పవన్ బయటకు.. హుటాహుటిన హైదరాబాద్ కు!

  • Jagan on Rayachoti constituency: నమ్మకస్తుడైన నేతను పక్కన పెడుతున్న జగన్!

  • Ambati vs Police : నువ్వెంత అంటే నువ్వెంత.. అంబటిని ఇచ్చి పడేసిన సీఐ!

  • 500 notes should be abolished: అవినీతిని అంతం చేయాలంటే రూ.500నోటు కూడా వద్దు.. ప్రధానిని కోరిన చంద్రబాబు

  • YS Jagan: విజయవాడ సబ్ జైల్ వద్ద క్యాసీన్ హై.. ఓ చిన్నారి ఏడుపు.. దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టిన జగన్!

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us