Pawan Kalyan leaves Cabinet Meeting: క్యాబినెట్ భేటీ నుంచి పవన్ బయటకు.. హుటాహుటిన హైదరాబాద్ కు!
Pawan Kalyan leaves Cabinet Meeting: ప్రస్తుతం అంజనాదేవి వయస్సు 81 సంవత్సరాలు. అయితే ఆమె ఆరోగ్య సమస్య ఏమిటంటే మాత్రం ఇంకా తెలియదు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏపీ క్యాబినెట్ భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే.

Pawan Kalyan leaves Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ సమావేశంలో( Cabinet meeting) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సమావేశం మధ్యలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. దీంతో అంతటా ఆందోళనకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి ఆరోగ్యం బాగాలేదని సమాచారం రావడంతో హుటాహుటిన పవన్ హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అంజనాదేవి వయస్సు 81 సంవత్సరాలు. అయితే ఆమె ఆరోగ్య సమస్య ఏమిటంటే మాత్రం ఇంకా తెలియదు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఏపీ క్యాబినెట్ భేటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభం అయింది. అయితే ఈ సమావేశం మధ్యలో నుంచి పవన్ బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. తల్లి అంజనాదేవి అనారోగ్యానికి గురికావడంతో అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకొని.. అక్కడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది.
చాలా యాక్టివ్ గా అంజనాదేవి..
పవన్ కళ్యాణ్ తల్లి అంజనాదేవి( Anjana Devi) చాలా యాక్టివ్ గా ఉంటారు. 81 సంవత్సరాలు గల ఆమె ఇప్పటికీ సరదాగా వంటలు చేస్తుంటారు. తన తల్లి వంటలంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి వాళ్ళ సందర్భాల్లో కూడా చెప్పారు. అంజనాదేవి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో చిరంజీవి స్పందించారు అమ్మ కొద్దిపాటి అస్వస్థతకు గురైన మాట వాస్తవమేనని.. అయితే ఆమె కోలుకున్నారని అప్పట్లో చిరంజీవి చెప్పుకొచ్చారు. మళ్లీ ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏకంగా క్యాబినెట్ సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
చిరంజీవి కుటుంబంతో తల్లి..
అంజనా దేవి ప్రస్తుతం చిరంజీవి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్లో ఉంటే మెగా ఫ్యామిలీ అంతా కలుస్తుంటుంది. పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత హైదరాబాదులోని తన సోదరుడు చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ తల్లి అంజనాదేవి, అన్న చిరంజీవి, వదిన సురేఖ ఆశీస్సులు తీసుకున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో విశాఖ మన్యం పర్యటనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. పూర్తిగా పర్యటన ముగించుకొని సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో పవన్ వెంట చిరంజీవి, సురేఖ దంపతులు ఉన్నారు. తాజాగా అంజనా అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో.. పవన్ క్యాబినెట్ మధ్యలో నుంచి వెళ్లిపోవడం మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. అంజనాదేవి వేగంగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితులపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
-
Pawan Kalyan National Film Awards: జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ ఎమన్నాడంటే?
-
Elephant Attack: ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
-
Krish Comments On Pawan Kalyan: ఎలాంటి విభేదాల లేవు.. పవన్ కల్యాణ్ పై క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Hari Hara Veeramallu Collection Day 2: వీర మల్లుకు షాక్.. 2వ రోజు వసూళ్లు ఎంతంటే!
-
Hari Hara Veera Mallu Review: హరి హర వీరమల్లు రివ్యూ.. ఎలా ఉందంటే..
-
Hari Hara Veera Mallu Facts: పవన్ కళ్యాణ్ హిట్ కొడతాడా.. హరిహర వీరమల్లు మూవీ గురించి ఆసక్తికర విషయాలు