Prakash Raj: కోట శ్రీనివాస రావు అందరికీ నచ్చలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్!

Prakash Raj: ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కోట శ్రీనివాస రావు ఆదివారం ఉదయం తన నివాసంలో ఫిలింనగర్‌లో మృతి చెందారు. కోట శ్రీనివాస రావు మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలోకి మునిగింది. సినీ ప్రముఖులు మృతిపై సంతాపం తెలియజేశారు. సినీ ఇండస్ట్రీలో కోట శ్రీనివాస రావు తన నటనతో చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 1942లో జన్మించారు. అయితే సినిమాల్లోకి కోట శ్రీనివాస రావు రాక ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తేవారు. ఆ తర్వాత ఆయనకు నటన మీద ఉన్న ఇష్టంతో నాటకాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు మొదటిగా 1978లో చిరంజీవి నటించిన ఫస్ట్ మూవీలో ‘ప్రాణం ఖరీదు’తో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ప్రతిఘటన’ సినిమాతో తన నటకు ప్రశంసలు దక్కాయి. తన జీవితాన్ని మలుపు తిప్పినది ఈ సినిమానే. ఇప్పటి వరకు కోట శ్రీనివాస రావు మొత్తం 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస రావు చివరగా హరి హర వీర మల్లు సినిమాలోనే నటించారు. ఈ నెల 24 వ తేదీన ఈ మూవీ విడుదల కాబోతుంది.
కోట శ్రీనివాస రావు మృతి చెందడంతో అతని భౌతిక కాయాన్ని చూసి నివాళ్లు అర్పించడానికి ప్రకాష్ రాజ్ కూడా వెళ్లారు. అక్కడ కోట శ్రీనివాస రావు గురించి మాట్లాడారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదన, భారత సినిమా గర్వించ దగిన నటుల్లో ఇతను కూడా ఒకరు అని తెలిపారు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇతని నటనను ప్రకాష్ రాజ్ బాగా గమనించారట. అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఎన్నో హిట్ సినిమాల్లో దాదాపుగా మూడు దశాబ్దాల పాటు నటించారని అన్నారు. అయితే ఇతను అందరికీ కూడా నచ్చరు. ఇతను కూడా అందరికీ నచ్చాలనే ప్రయత్నం అసలు చేయలేదని అన్నారు. మళ్లీ ఇలాంటి ఒక నటుడుని అసలు చూడలేమని, తను లేకపోవడం చాలా బాధకారం అని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్‌పై కోటా శ్రీనివాస రావు ఎన్నోసార్లు విమర్శలు చేశారు. అప్పట్లో ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి గురించి విష్ణుతో పోటీ పడ్డారు. అప్పుడు ఇరు వర్గాల మధ్య గొడవలు అయిన విషయం తెలిసిందే. విష్ణు లోకల్ అని, ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ వ్యక్తి అని కోట అన్నారు. ఇలా నాన్ లోకల్ వ్యక్తికి మా చైర్మన్ అయ్యే అర్హత లేదని, తెలుగు వాళ్లను ప్రోత్సహించండని కోట శ్రీనివాస రావు అన్నారు. అప్పట్లో వీరి గొడవ ఒక పెద్ద సెన్సెషన్ అయ్యింది. ఇంత గొడవ జరిగినా కూడా ప్రకాష్ రాజ్ కోట భౌతికాయం దగ్గరకు వచ్చారు.
ఇది కూడా చూడండి: Samantha-Shobitha: రివర్స్ అయిన సమంత ఫ్యాన్స్.. శోభిత ఏంజిల్, సమంత జోకర్ అంటూ పోస్ట్‌లు
-
Loans: తాత్కాలిక లోన్స్ తీసుకుంటున్నారా.. అయితే ఇక మీకు చావే
-
RGV Sensational Comments: సందీప్ వంగా, దీపికా పదుకొణె ఇష్యూపై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
Anil Ravipudi: సుధీర్‌నే టార్గెట్ చేయమన్నారు.. సంచలన విషయాలు బయట పెట్టిన అనిల్ రావిపూడి
-
Rainy Season: వర్షాకాలంలో ఇలా మొబైల్ యూజ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
-
Devi Sri Prasad: కుబేర సక్సెస్ మీట్ స్పీచ్.. పేమెంట్‌కు దేవిశ్రీ కౌంటర్ వేశాడా?
-
Garikapati Narasimha Rao: బాధలో ఉన్నప్పుడు బలం ఇచ్చేది ఏమిటి?