Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

Oppo reno series: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒకటైన ఒప్పో మార్కెట్‌లోకి కొత్త సిరీస్‌ను రిలీజ్ చేయనుంది. మొబైల్స్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రెనో 14 సిరీస్‌ను ప్రారంభించనుంది. దీన్ని ఇండియన్ మార్కెట్‌లోకి జూన్ 3వ తేదీన లాంఛ్ చేయనుంది. ఈ లైనప్‌లో మూడు వేరియంట్‌లు ఉంటాయి. రెనో 14, రెనో 14 ప్రో, రెనో 14F ఉంటుంది. అయితే ఈ మూడు కూడా శక్తివంతమైన పనితీరు, అద్భుతమైన డిజైన్‌ను ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే దేశంలో ఈ రెనో 14 సిరీస్ మిడ్-ప్రీమియం ధర సాధారణంగా ఉంది. రెనో 14F ధర రూ.31,999 ఉంటుంది. అలాగే రెనో 14 ధర రూ.39,999 ఉండగా రెనో 14 ప్రో ధర రూ.53,999 నుంచి ప్రారంభమై రూ.55,999 వరకు ఉంటుంది. అయితే ఈ ధరలు కూడా వేరియంట్‌ను బట్టి ఉంటాయి. కొనుగోలు చేయాలనుకునే వారికి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఒప్పో రెనో 14 ప్రోలో గొరిల్లా గ్లాస్ ఉంటుంది. అన్ని మోడళ్లకు వంపుతిరిగిన అంచులు, ప్రీమియం ఫినిషింగ్‌లతో సన్నని ప్రొఫైల్‌లు ఉంటాయి. అన్ని మోడళ్లు AMOLED డిస్ప్లేలతో రావడంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్లతో రానున్నాయి.
ఒప్పో రెనో 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 50MP టెలిఫోటో, అల్ట్రా-వైడ్, మెయిన్ సెన్సార్‌తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా, 50MP AI సెల్ఫీ కెమెరా ఉంటాయి. OPPO రెనో 14F లో డ్యూయల్ రియర్ కెమెరాలు ఉంటాయి. అలాగే మొబైల్ పనితీరు బాగుంటుంది. బ్యాటరీ కూడా కాస్త మెరుగ్గా ఉంటుంది. OPPO రెనో 14 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. OPPO రెనో 14 ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. OPPO Reno 14F అయితే Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇప్పుడు ఉన్న అన్ని వేరియంట్‌లోని మోడల్స్ కూడా 6,000mAh బ్యాటరీతో రానున్నాయి. అన్ని శ్రేణులలో ఫాస్ట్ ఛార్జింగ్, ప్రో వేరియంట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్‌ఓఎస్‌ను అమలు చేస్తాయి. ఎవరైనా వెంటనే ఈ మోడల్స్ కొనుగోలు చేయాలని అనుకుంటే మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే చేసేయవచ్చు. ఇందులో మీకు కావాల్సినన్ని ఆఫర్లు ఉంటాయి. ఈ ఒప్పోలో కెమెరా పనితీరు కాస్త మెరుగ్గా ఉంటుంది. అలాగే మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Hari hara Veera mallu movie Trailer: వచ్చేసిన హరి హర వీర మల్లు ట్రైలర్.. పవర్‌ఫుల్ లుక్‌లో విధ్వంసం సృషించిన పవన్!
-
Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Huawei smart band 10: హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్.. బెస్ట్ ధరకు ఫీచర్లు
-
Galaxy Buds 3 Series: గెలాక్సీ ఇయర్ బడ్స్ 3 సిరీస్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు
-
OnePlus 13s : ఆపిల్‌కు టెన్షన్ పట్టుకుంది.. OnePlus 13s ఇండియా లాంచ్ డేట్ ఖరారు
-
Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి
-
Mahindra Bolero : టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా మహీంద్రా బొలెరో బోల్డ్.. ప్రత్యేకతలు ఇవే!