Huawei smart band 10: హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్.. బెస్ట్ ధరకు ఫీచర్లు

Huawei smart band 10: భారత మార్కెట్‌లోకి సరికొత్త హువావే స్మార్ట్ బ్యాండ్ వచ్చింది. హువావే బ్యాండ్ 10 పేరుతో విడుదలైన ఈ స్టైలిష్ పరికరం, అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీని ధర రూ.6,499 నుంచి మొదలవుతుంది. దీనపై ప్రత్యేక లాంచ్ ఆఫర్ కూడా ఉంది. భారతదేశంలో, హువావే బ్యాండ్ 10 పాలిమర్ కేస్‌తో ఉన్న వేరియంట్ రూ.6,499కి లభిస్తుంది. అల్యూమినియం అల్లాయ్ మోడల్ ధర రూ.6,999కి వస్తుంది. అయితే జూన్ 10 వరకు ఉన్న ప్రత్యేక ఆఫర్ వల్ల పాలిమర్ వెర్షన్ ను కేవలం రూ.3,699కి, అల్యూమినియం ఆప్షన్‌ను రూ.4,199కి పొందవచ్చు. ఈ స్మార్ట్ బ్యాండ్‌ను అమెజాన్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయవచ్చు. హువావే బ్యాండ్ 10 నలుపు, గులాబీ రంగులలో పాలిమర్ కేసులతో అందుబాటులో ఉంది. అలాగే, నీలం, ఆకుపచ్చ, మ్యాట్ బ్లాక్, పర్పుల్, తెలుపు రంగులలో కూడా పాలిమర్ కేసులతో ఉన్న వేరియంట్లు ఉన్నాయి.
హువావే బ్యాండ్ కి1.47 అంగుళాల హామ్‌లోల్డ్ దీర్ఘ చతురస్రాకార డిస్‌ప్లే ఉంటుంది. 194×368 పిక్సెల్స్ రిజల్యూషన్, 282 పిక్సెల్ సాంద్రతతో కలిగి ఉంది. దీనికి ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా ఉంది. స్క్రీన్ స్వైప్, టచ్‌లకు స్పందిస్తుంది. సులభంగా వాడటానికి పక్కన ఒక బటన్ కూడా ఉంటుంది. ఈ బ్యాండ్ రన్నింగ్, సైక్లింగ్, యోగా, స్విమ్మింగ్ వంటి 100 ప్రీసెట్ వర్కౌట్ మోడ్‌లను కూడా అందిస్తుంది. మెరుగైన ట్రాకింగ్ కోసం ఇందులో యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ వంటి సెన్సార్లు ఉన్నాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ చేసేవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తొమ్మిది యాక్సిస్ సెన్సార్, స్ట్రోక్ గుర్తింపు లక్షణాల వల్ల, స్విమ్ స్ట్రోక్, ల్యాప్ గుర్తించడంలో 95 శాతం మెరుగ్గా ఉంటుంది. ఇది Android, iOS ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది.
హువావే బ్యాండ్ 10 లో ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్-ఆక్సిజన్ లెవల్ మానిటర్ ఉన్నాయి. ఇది నిద్ర తీరు, గుండె స్పందన వేరియబిలిటీ (HRV), నిద్ర నాణ్యత, ఒత్తిడి స్థాయిలను కూడా ట్రాక్ చేయగలదు. అంతర్నిర్మిత శ్వాస వ్యాయామాలతో పాటు, ఎమోషనల్ వెల్ బీయింగ్ అసిస్టెంట్‌తో పాటు వెల్‌నెస్ చిట్కాలను కూడా వాచ్ సూచిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల వరకు ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఐదు నిమిషాల తక్కువ ఛార్జ్‌తో రెండు రోజుల వరకు వాడవచ్చు. ఈ స్మార్ట్ బ్యాండ్ కేవలం 8.99 మి.మీ. మందం, 14 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.
-
Flipkart Goat Sale: అదిరిపోయే ఫీచర్లతో రూ.4,499 స్మార్ట్‌ఫోన్.. ఆలస్యమెందుకు కొనేయండి
-
Mahindra : నెక్సాన్, బ్రెజ్జాకు గట్టిపోటీ.. మహీంద్రా చౌకైన కారు అప్ డేటెడ్ వెర్షన్ వస్తోంది
-
Tecno pova series: 6000mAh బ్యాటరీతో టెక్నో పోవా 7 సిరీస్ మొబైల్.. ఫీచర్లు చూస్తే పిచ్చేక్కిపోవాల్సిందే!
-
Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
-
Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!
-
Galaxy Buds 3 Series: గెలాక్సీ ఇయర్ బడ్స్ 3 సిరీస్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు