Iphone 17 series: సెప్టెంబర్‌లో లాంఛింగ్‌కి రెడీగా ఉన్న ఐఫోన్ 17 సిరీస్.. కెమెరా చూస్తే వావ్ అనాల్సిందే!

Iphone 17 series: ఐఫోన్ అనేది చాలా మంది కల. కష్టపడిన డబ్బులను సేవ్ చేసి మరి ఐఫోన్‌ను కొనుగోలు చేస్తారు. ఇంతకు ముందు రోజుల కంటే ఇప్పుడు చాలా మంది ఐఫోన్ వాడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ ఏడాది ఒక కొత్త సిరీస్ మార్కెట్‌లోకి వస్తుంటుంది. ఇందులో ఫొటోలు బాగా రావడంతో పాటు కాస్త సెక్యూరిటీ ఉంటుందని చాలా మంది వాడుతారు. అయితే మార్కెట్లోకి ప్రతీ ఏడాది కొత్త సిరీస్ వస్తుంది. ఇప్పటి వరకు ఐఫోన్ 16 సిరీస్ ఉంది. ఈ ఏడాది ఐఫోన్ 17 సిరీస్ రాబోతుంది. ఈ క్రమంలో ఐఫోన్ 17 సిరీస్ గురించి కొన్ని లీక్‌లు అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తప్పకుండా ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ రానున్నాయి. వీటికి సంబంధించిన కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. అవేంటో మరి ఈ స్టోరీలో చూద్దాం.
సెప్టెంబర్ ఐఫోన్ 17 సిరీస్‌ను లాంఛ్ చేయడానికి యాపిల్ సంస్థ సిద్ధంగా ఉంది. ఐఫోన్ 17 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు ఉంటాయి. ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మాక్స్ అని ఉంటాయి. వీటిని యాపిల్ సంస్థం లాంఛ్ చేయనుంది. నాలుగు మోడళ్లలో 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది ఐఫోన్ 16 లో కనిపించే 12MP నుంచి ఒక పెద్ద అప్‌గ్రేడ్. ఇక ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ 12MP నుంచి మరింత శక్తివంతమైన 48MP టెలిఫోటో లెన్స్‌తో వస్తాయి. క్రిస్పర్ జూమ్, పోర్ట్రెయిట్ షాట్‌ల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. టైటానియంలో ఐఫోన్ 17 ప్రో అల్యూమినియం, గాజును కలిపే హైబ్రిడ్ వెనుక ప్యానెల్‌తో అల్యూమినియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తున్నారు. దీర్ఘచతురస్రాకార కెమెరా హౌసింగ్ కూడా దీనికి ఉంటుంది. ఇక ప్రో మోడల్స్ కోసం అయితే A19 ప్రో చిప్ ఉపయోగించారు. ఐఫోన్ 17 ప్రో మోడల్స్ ఆపిల్ A19 ప్రో చిప్ పై నడుస్తాయి. వీటివల్ల మొబైల్ బాగా వర్క్ అవుతుంది.
ఈ సిరీస్ ఆపిల్ కస్టమ్-డిజైన్ చేశారు. ఇందులో Wi-Fi 7 చిప్‌సెట్ బ్రాడ్‌కామ్ మాడ్యూల్‌లు కూడా ఉన్నాయి. అయితే వీటిని మల్టీ టాస్కింగ్ కోసం వాడారు. అలాగే Apple ఇంటెలిజెన్స్ ఫీచర్లకు కూడా అనుగుణంగా ఉండేలా సరికొత్తగా తీసుకొస్తున్నారు. అయితే ఇన్ని ఫీచర్లు కొత్తగా రానున్నాయి. వీటివల్ల ఈ సిరీస్ బాగుంటుంది. అలాగే ఇందులో ఫొటోలు కూడా మునుపటి ఐఫోన్ మోడల్ కంటే బాగా వస్తాయని తెలుస్తోంది. అయితే ఐఫోన్ 17 సిరీస్ ధర రూ.1.5 లక్షల వరకు దేశంలో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: RailOne : రైల్వే ప్రయాణికులకు బంపర్ న్యూస్.. టికెట్, ఫుడ్.. అన్నీ ఒకే యాప్‌లో!
-
Oppo reno series: తక్కువ ధరకే బెస్ట్ ఫోన్ భయ్యా.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!
-
Huawei smart band 10: హువావే కొత్త స్మార్ట్ బ్యాండ్.. బెస్ట్ ధరకు ఫీచర్లు
-
Galaxy Buds 3 Series: గెలాక్సీ ఇయర్ బడ్స్ 3 సిరీస్.. ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు
-
Apple : 2025లో ఆపిల్ ప్లాన్.. కంపెనీ నుంచి రాబోయే ఐదు అదిరిపోయే ఉత్పత్తులు ఇవే!
-
OnePlus 13s : ఆపిల్‌కు టెన్షన్ పట్టుకుంది.. OnePlus 13s ఇండియా లాంచ్ డేట్ ఖరారు
-
Gmail : టైమ్ సేవింగ్ ట్రిక్స్.. Gmailలోని ఈ 4 అద్భుతమైన ఫీచర్లను తెలుసుకోండి