Maruti Suzuki : చీపెస్ట్ ఫ్యామిలీ కారు.. 7 మందితో రయ్ రయ్..!
maruti suzuki : కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి భారతదేశంలో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ కంపెనీ ఎక్కువగా సామాన్యులను దృష్టిలో ఉంచుకొని తమ వాహనాలను తక్కువ ధరలో

<h3>maruti suzuki </h3>కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి భారతదేశంలో అద్భుతమైన క్రేజ్ ఉంది. ఈ కంపెనీ ఎక్కువగా సామాన్యులను దృష్టిలో ఉంచుకొని తమ వాహనాలను తక్కువ ధరలో లాంచ్ చేసి ఆకట్టుకుంటుంది. సాధారణంగా చెప్పాలంటే మన భారతదేశంలో దాదాపు పది మందిలో ఆరు మంది మారుతి కార్లు కొనడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో పేదింటి కార్లు రిలీజ్ చేసిన కంపెనీ ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ కోసం ఏడు సీట్లు కలిగిన మరొక చీపెస్ట్ కారును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇందులో భాగంగానే మారుతి సుజుకి ‘YDB’ కోడ్ నేమ్ తో ఒక సరికొత్త కాంపాక్ట్ MPV (మల్టీపర్పస్ వెహికల్) ను భారతదేశంలో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ మోడల్ రాకతో ఇప్పటివరకు మారుతి ఎంపీవి విభాగంలో ఆధిపత్యం చెలాయించిన ఎర్టిగాకు ఇప్పుడు బ్రేక్ పడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మోడల్ ను జపాన్ లో ఫుల్ పాపులర్ అయిన సుజుకి ‘ స్పాసియా’ ఆధారంగా రూపొందించారు.
జపాన్ మార్కెట్లో ఎనలేని క్రేజ్‌తో ఫుల్‌గా సేల్స్ జరుపుకుంటున్న ఈ మోడల్.. ఇప్పుడు భారత మార్కెట్లో రయ్ రయ్ మంటూ చెక్కర్లు కొట్టేందుకు రెడీ అవుతోంది. అయితే జపానీస్ సుజుకి స్పాసియా రెండు వరుస సీట్లను మాత్రమే కలిగి ఉంటుంది. కానీ భారత్ వెర్షన్ మాత్రం మూడు వరుసలలో ఏడు సీట్లతో వస్తుందని తెలుస్తోంది.
ఇక దీని ధర విషయానికి వస్తే.. భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఈ మోడల్ ప్రారంభ ధర రూ. 6 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ Z సిరీస్ 3 సిలిండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటి ఆటోమేటిగ్గా ఉంటుందని సమాచారం. ఈ మోడల్ భారతదేశంలో 2026 లో విడుదలయ్యే అవకాశం ఉంది.
-
Tibetan prayer flags: బైక్‌కు ఈ రంగుల జెండా ఎందుకు కడతారో మీకు తెలుసా?
-
Car to Last Longer: కారు ఎక్కువ రోజులు మన్నికగా ఉండాలంటే.. ఈ మిస్టేక్స్ చేయవద్దు
-
Hyundai Venue Sales: రూ.7.94 లక్షలకే క్రెటా లాంటి SUV.. 6.68 లక్షల మంది అభిమానం చూరగొన్న హ్యుందాయ్ వెన్యూ
-
CNG car: సీఎన్జీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే బెస్ట్ కంపెనీల కార్లు ఇవే!