CNG car: సీఎన్జీ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే బెస్ట్ కంపెనీల కార్లు ఇవే!

CNG Car :
కారు కొనాలని చాలా మందికి కోరిక ఉంటుంది. దేశంలో కూడా ప్రస్తుతం కారు వినియోగం ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లు ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో చాలా మంది వీటివైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కంటే సీఎన్జీ కార్ల వైపు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లు ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడే పేలిపోతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది సీఎన్జీ కార్లు కొనాలని అనుకుంటున్నారు. అయితే ఈ సీఎన్జీ కారు కొనాలంటే ఏ బ్రాండ్‌లో తీసుకోవాలో సరిగ్గా తెలియదు. మార్కెట్‌లో చాలా కంపెనీల సీఎన్జీ కార్లు ఉన్నాయి. వీటిలో ధరలతో పాటు కొన్ని ఫీచర్లు కూడా మారుతుంటాయి. అయితే తక్కువ బడ్జెట్‌ల బెస్ట్ సీఎన్జీ కార్లు ఏవో మరి ఈ స్టోరీలో చూద్దాం.
మారుతి సుజుకి స్విఫ్ట్
ప్రీమియంలో సీఎన్జీ కారు కావాలంటే మాత్రం మారుతి సుజుకి స్విఫ్ట్ బెస్ట్ ఆప్షన్. ఈ కార ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 8.19 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. పవర్‌ట్రెయిన్ సీఎన్జీ వేరియంట్‌లో 69.75 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కారు కిలోగ్రాముకు 32.85 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఈ కారుకి స్టాండర్డ్‌గా మొత్తం 6 ఎయిర్ బ్యాగ్‌లు ఇస్తారు.
టాటా పంచ్
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఇకటి. మన దేశంలో ఈ కారు ప్రారంభ ధర రూ.6 లక్షలు ఉంటుంది. అయితే సీఎన్జీ కారు అయితే రూ.7.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు ఈ ఎస్‌యూవీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాది. ఈ సీఎన్జీ మోడల్ కారు గరిష్టంగా 73.5 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయగలదు. అలాగే 27 కిమీల వరకు మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి డిజైర్
సీఎన్జీ కార్లలో మారుతి సుజుకి డిజైర్ కారు కూడా బెస్ట్ అని చెప్పవచ్చు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ.6.84 లక్షలు. అయితే ఈ కారు సీఎన్జీ మోడల్ ధర రూ.8.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 33.73 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. తక్కువ ఖరీదులో బెస్ట్ సీఎన్జీ కార్లు కావాలనుకుంటే మాత్రం ఈ కారు బెస్ట్ అని చెప్పవచ్చు.