Ant Control Tips : ఇంట్లో చీమల బెడద ఉందా?.. రూ.5తో శాశ్వతంగా చెక్ పెట్టేయండి

Ant Control Tips : ఇంట్లో చీమలను తరిమికొట్టడానికి చాలా చిట్కాలు ఉన్నాయి. కానీ వాటిలో అత్యంత ప్రభావవంతమైనది.. అన్నింలోకీ చౌకైనది వెనిగర్ (vinegar) అంటే తెల్ల వినెగర్. వెనిగర్ వాసన చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి ఇది వాటికి చాలా చిరాకు కలిగిస్తుంది. ఈ వస్తువు దాదాపు ప్రతి ఇంట్లోనూ సులభంగా లభిస్తుంది. దీనిని ఉపయోగించడం కూడా చాలా తేలిక. వెనిగర్‌తో చీమలను మీ ఇంటి నుంచి ఎలా తరిమికొట్టవచ్చో వివరంగా తెలుసుకుందాం.
ముందుగా వెనిగర్‌ను తీసుకుని నీటిలో కలపాలి. ఆ తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి. అందులో సగం వెనిగర్, సగం నీరు పోసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ఇంట్లో చీమలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. ఉదాహరణకు కిచెన్, తలుపుల దగ్గర, కిటికీల పక్కన, ఫర్నిచర్ కింద లేదా మీరు చీమల జాడలు చూసిన ఏ ప్రదేశంలోనైనా స్ప్రే చేయవచ్చు. వెనిగర్ వాసన చీమలను ఇబ్బంది పెడుతుంది. అవి ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోతాయి.
Read Also:RBI : కేంద్రానికి భారీ బొనాంజా.. RBI నుండి రూ.3లక్షల కోట్ల చెక్కు!
స్ప్రే తయారు చేయడానికి ఇంకా ఏమి కావాలి?
వెనిగర్‌తో పాటు మీరు నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. నిమ్మకాయలో యాసిడ్ ఉంటుంది. ఇది చీమలను దూరం చేస్తుంది. నిమ్మ తొక్కలను చీమలు వచ్చే ప్రదేశాలలో ఉంచండి లేదా నిమ్మరసాన్ని నీటిలో కలిపి స్ప్రే చేయండి. ఈ పద్ధతి కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. చీమలను తరిమికొట్టడానికి దాల్చిన చెక్క పొడి లేదా దాల్చిన చెక్క బెరడు కూడా ఉపయోగపడుతుంది. మీరు దాల్చిన చెక్కను చీమలు వెళ్లే దారిలో చల్లండి.
దాని వాసన చీమలను ఇబ్బంది పెడుతుంది. అవి తిరిగి రావు. ఈ పద్ధతి కూడా చాలా ఈజీ. దీనితో పాటు కొద్దిగా బోరిక్ పౌడర్ లేదా కార్న్‌స్టార్చ్‌తో కలిపి కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇది పిల్లలకు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే బోరిక్ యాసిడ్ విషపూరితమైనది.. మీరు వెనిగర్‌తో చీమలను తరిమికొట్టాలనుకుంటే స్ప్రే చేసేటప్పుడు ఇంటి కిటికీలు, తలుపులు కొద్దిసేపు తెరవండి. తద్వారా వాసన త్వరగా పోతుంది, ఇంట్లో ఉండేవారికి ఇబ్బంది కలగదు.
Read Also:Happy life: ఇలాంటి ఇంట్లో హ్యాపీ లైఫ్.. చల్లని గాలి.. ప్రశాంతత
స్ప్రే ఎలా ఉపయోగించాలి?
వెనిగర్‌తో ఫర్నిచర్ లేదా ఇతర ఉపరితలాలపై స్ప్రే చేసిన తర్వాత కొద్దిగా శుభ్రం చేయవచ్చు. తద్వారా ఎటువంటి మరకలు లేదా దుర్వాసన ఉండదు. చీమలను తరిమికొట్టడానికి శుభ్రత కూడా చాలా ముఖ్యం. భోజనం చేసేటప్పుడు లేదా వంట చేసేటప్పుడు అన్ని ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి. చెత్తను వెంటనే బయట పడేయండి. ఆహార పదార్థాలను మూత ఉన్న డబ్బాలలో ఉంచాలి. వెనిగర్, నిమ్మకాయ వాడటంతో పాటు ఈ అలవాట్లు మీ ఇంటి నుంచి చీమలను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి మొత్తంమీద వెనిగర్ చాలా చౌకైనది, సులభంగా లభించేది.. అంతేకాకుండా ప్రభావవంతంగా పనిస చేస్తుంది. దీని సహాయంతో మీరు ఖరీదైన క్రిమిసంహారక మందులు లేకుండా మీ ఇంటి నుండి చీమలను తరిమికొట్టవచ్చు.