Happy life: ఇలాంటి ఇంట్లో హ్యాపీ లైఫ్.. చల్లని గాలి.. ప్రశాంతత

Happy life: సోషల్ మీడియా కాలంలో యువతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు ఎక్కువ మక్కువ చూపిస్తుంది. పచ్చని వాతావరణం అన్నింటిని కూడా వదులుకుని స్మార్ట్ ఫోన్లతో జీవిస్తున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మొబైల్ వాడుతున్నారు. నిజం చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ లేకపోతే కొందరికి రోజు కూడా గడవదు. అసలు ఈ ఫోన్ ఒక్క నిమిషం పనిచేయకపోతే పిచ్చి అయిపోతారు. ఈ స్మార్ట్ ఫోన్ మాయలో పడి చాలా మంది సంతోషాలను కోల్పోతున్నారు. లైఫ్‌లో వచ్చే చిన్ని చిన్ని ఆనందాలను వారి చేతులారే దూరం చేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
పచ్చని ప్రకృతికి దగ్గరగా ఉండకుండా స్మార్ట్‌ఫోన్లకు ఎక్కువ దగ్గరగా ఉంటున్నారు. చిన్నప్పుడు చెట్లు, ఇంటి పరిసరాలు కింద ఆడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మొబైల్ చూసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో మనుషులతో కంటే గ్యాడ్జెట్స్‌తోనే ఎక్కువగా గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలా మన చిన్నప్పటి గుర్తులు వచ్చే ఒక ఫొటో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: Kingdom Movie: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ వాయిదా.. కారణమిదే
ఒక పెద్ద మర్రిచెట్టు.. దాని పక్కనే చేను.. ఆ మర్రి చెట్టు నీడలో ఒక చిన్న ఇల్లు ఉంటుంది. కళ్ల చుట్టూ కూడా పచ్చని వాతావరణం ఉంటుంది. ఆ చెట్టు నీడలో ఇళ్లు అయితే భలేగా ఉంది. అసలు అంతటి అందాన్ని చూడటానికి కళ్లు కూడా సరిపోవు. నిజం చెప్పాలంటే డబ్బులు పెట్టి ఏసీలో ఉన్నా కూడా దొరకని ఆనందం ఈ చెట్టు నీడలో కనిపిస్తుంది. చల్లని గాలి, వర్షాల, మట్టి వాసన, పొలాలు ఇలా అన్ని అందాలను కూడా ఈ ఇంట్లో ఉండి చూడవచ్చు.
ఇది కూడా చూడండి: Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
ఈ ఫొటో ఒక విషయాన్ని మనకి చెబుతోంది. ఇలాంటి ఇంట్లో ఉంటే వచ్చే సంతోషం కోట్లు పెట్టి కొన్న భవనంలో కూడా రాదని చెబుతోంది. అయితే ఈ ఫొటో నిజమైనదో కాదో తెలియదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొందరు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి ఇళ్లు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉందని అంటున్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారని, ఎవరూ కూడా ఇలాంటి ఇంట్లో ఉండటం లేదని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి పర్యావరణ కోసం మొక్కలు వంటివి నాటాలి. కానీ బిల్డింగ్‌ల కోసం ఉన్న చెట్లు, మొక్కలను నరికేస్తున్నారు. స్వచ్ఛమైన గాలి కంటే కూలర్లు, ఏసీలకు బాగా అలవాటు పడ్డారు. వీటిలో ఉంటే అసలు సంతోషమే ఉండదు. కానీ పర్యావరణంలో చల్లని గాలులు మధ్య ఉంటే మాత్రం ఎంతో సంతోషంగా ఉంటుంది.