Dark Spots : ఈ 5 ఇంటి చిట్కాలు ట్రై చేయండి..వేసవిలో నల్ల మచ్చలకు చెక్ పెట్టండి

Dark Spots : వేసవిలో చర్మం చాలా ఇబ్బంది పడుతుంది. మండే ఎండలు, వేడి కారణంగా చర్మం మీద టాన్ లేదా సన్‌బర్న్ వస్తుంది. అంతేకాకుండా, మచ్చలు, నల్ల మచ్చలు, మొటిమల వంటి సమస్యల వల్ల ముఖం నిర్జీవంగా కనిపిస్తుంది. సరైన చర్మ సంరక్షణ లేకపోతే ముఖం నిస్తేజంగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ ఫలితం కనిపించదు. ఎందుకంటే కెమికల్ ఆధారిత ఉత్పత్తులు మీ చర్మానికి హాని కలుగజేస్తాయి.
వృద్ధాప్య ఛాయలు మొదట ముఖంపైనే కనిపిస్తాయి. ముడతలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు మీ లుక్ పాడుచేస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో వీటిని తగ్గించుకోవచ్చు. నల్ల మచ్చల సమస్యను తగ్గించడానికి ఎలాంటి ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చో తెలుసుకుందాం.
Read Also:Washing Silk Sarees : పట్టు చీరలు, సూట్‌లు ఎప్పటికీ కొత్తలా మెరవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
పసుపు , శనగపిండి :
దీనిని తయారు చేయడానికి 3 చెంచాల శనగపిండిలో అర చెంచా పసుపు కలపండి. మీది జిడ్డుగల చర్మం అయితే రోజ్ వాటర్ కలపండి. పొడి చర్మం అయితే పాలు కలపండి. తర్వాత ఈ ఫేస్ మాస్క్‌ను ముఖానికి 15-20 నిమిషాలు పట్టించండి. ఇది మీ పిగ్మెంటేషన్, నల్ల మచ్చల సమస్యను తగ్గిస్తుంది.
ముల్తానీ మట్టి, టొమాటో
టొమాటోలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నల్ల మచ్చల సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ముల్తానీ మట్టి చర్మం నుంచి మురికిని తొలగించి దానిని శుభ్రంగా ఉంచడానికి సాయపడుతుంది. ఈ మాస్క్ తయారు చేయడానికి 4 చెంచాల ముల్తానీ మట్టిలో 2 చెంచాల టొమాటో రసం కలిపి ముఖానికి పట్టించాలి. దీన్ని వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
బాదం, పాలను చర్మ సంరక్షణ
బాదంలో విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి, మచ్చలేని ముఖాన్ని పొందడానికి సాయపడుతుంది. పాలు ముడతలు, నల్ల మచ్చలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
Read Also:Anaganaga: తండ్రి, కొడుకు మధ్య ఉన్న ఎమోషన్.. కళ్లకు కట్టినట్లు చూపించారుగా!]
వేప, తులసితో మాస్క్
వేప, తులసి రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ముఖంపై మొటిమల సమస్యను తగ్గించడానికి లేదా తొలగించడానికి సహాయపడతాయి. చర్మాన్ని మెరిసేలా, మృదువుగా చేస్తాయి.
నారింజ తొక్క, తేనె మాస్క్
నారింజ తొక్కలను ఎండలో ఆరబెట్టి, ఆపై గ్రైండర్‌లో పొడి చేయండి. ఇప్పుడు ఈ పొడిలో తేనె కలిపి మాస్క్ తయారు చేయాలి.దీనిని ఉపయోగించడం వల్ల చర్మం రంగు మెరుగుపడుతుంది.
-
Healthy Soup: డైలీ ఈ సూప్ తాగితే.. ఆరోగ్యంతో పాటు అందం మీ సొంతం
-
Curd: పెరుగు మిగిలిపోయి వేస్ట్ కావద్దంటే.. ఇలా ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందమే అందం
-
Mango Peel : తొక్కే కదా తీసేస్తున్నారా.. మామిడి తొక్కతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకవుతారు
-
Turmeric Health Benefits: టర్మరిక్ ట్రెండ్ కాదు.. ఇలా పసుపు కలిపి తాగితే?
-
Kidney Issues: వీటిని మీరు డైలీ తీసుకుంటే.. మీ కిడ్నీలు సేఫ్
-
Skin Care : నగ్న స్నానం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా ?