Summer Skincare : వేసవిలో నల్లగా మారిన చేతులు మిలమిలా మెరవాలా.. ఈ 5 చిట్కాలు పాటించండి

Summer Skincare : వేసవి కాలం ఎన్నో సమస్యలను మోసుకొస్తుంది. ముఖ్యంగా చర్మ సంరక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చర్మం నల్లగా మారిపోతుంది. వేడి ఎండలు, ఉక్కపోత వల్ల చర్మంపై ట్యాన్ (రంగు మారడం) ఏర్పడడం చాలా సాధారణం. మనం సాధారణంగా ముఖాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకుంటాం. చేతులను నిర్లక్ష్యం చేస్తాం. కానీ మన చేతులకు కూడా అంతే శ్రద్ధ అవసరం. సూర్యరశ్మి నేరుగా చేతులపై పడడం వల్ల అవి నల్లగా, పొడిగా మారతాయి.
ట్యాన్‌ను తొలగించడానికి మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి చాలా ఖరీదైనవిగా లేదా లేదా వాటిలోని రసాయనాల (కెమికల్స్) వల్ల వాటిని ఉపయోగించడానికి చాలా మంది ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల్లో సులభమైన పరిష్కారం ఇంటి చిట్కాలు (హోమ్ రెమెడీస్) పాటించడమే. ఇంట్లో దొరికే వాటితో చేసుకునే మాస్క్‌లు ట్యాన్‌ను తగ్గించడమే కాకుండా, చర్మానికి పోషణను అందించి, సహజమైన మెరుపును తిరిగి ఇస్తాయి. కాబట్టి, ఈ కథనంలో వేసవిలో ట్యాన్ పట్టిన చేతులకు కాంతిని పెంచే కొన్ని ఈజీ ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.
ట్యాన్ తొలగించే ఇంటి మాస్క్‌లు:
శనగపిండి, పసుపు, పెరుగు మాస్క్
శనగపిండి మాస్క్ వేసవిలో చేతులకు పట్టిన ట్యాన్‌ను తొలగించడానికి ఒక అద్భుతమైన పరిష్కారం. దీనికోసం 2 చెంచాల శనగపిండి, 1 చిటికెడు పసుపు, 1 చెంచా పెరుగును కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి, 20 నిమిషాల తర్వాత చేతులను కడిగేయండి. ఈ మాస్క్ ట్యాన్‌ను తొలగించడమే కాకుండా చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
Read Also:Baal Aadhaar : ‘బాల్ ఆధార్’ వ్యాలిడిటీ 5 ఏళ్లే..ఆలస్యం చేస్తే పనికిరాదు.. ఇప్పుడు ఏం చేయాలంటే ?
అలోవెరా, నిమ్మకాయ మాస్క్
దీన్ని తయారు చేయడానికి 2 చెంచాల అలోవెరా జెల్లో 1 చెంచా నిమ్మరసం కలిపి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతులకు, ట్యాన్ పట్టిన ప్లేసుల్లో రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. అలోవెరా చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మకాయ ట్యాన్‌ను తగ్గిస్తుంది.
ఆలూ, రోజ్ వాటర్ మాస్క్
ఆలూ (బంగాళాదుంప) కూడా ట్యాన్‌ను తొలగించడానికి చాలా ప్రయోజనకరం. దీన్ని నేరుగా చేతులకు అప్లై చేయవచ్చు. లేదంటే, తురిమిన ఆలూలో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఆలూలో సహజమైన బ్లీచింగ్ ఏజెంట్లు ఉంటాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపరుస్తాయి.
టమాటా , తేనె మాస్క్
టమాటాను మెత్తగా చేసి, అందులో తేనె కలపాలి. ఈ పేస్ట్‌ను చేతులకు రాసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. టమాటా సన్ ట్యాన్‌ను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది.
Read Also:Karnataka : నాకో లవర్ ఉన్నాడు.. మండపంలో ధైర్యంగా వధువు చేసిన పని వైరల్.. వీడియో
కీరదోస, ముల్తానీ మట్టి మాస్క్
2 చెంచాల కీరదోస రసం తీసుకుని, అందులో 1 చెంచా ముల్తానీ మట్టి వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చేతులకు రాసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మాస్క్ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది. ట్యాన్‌ను తగ్గిస్తుంది.
ఈ చిట్కాలను ప్రయత్నించి వేసవిలో కూడా మీ చేతులను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.