Summer skincare : ఎండకి చర్మం నల్లగా మారుతుందా.. ఈ టిప్స్ పాటించండి
Summer skincare: సన్‌స్క్రీన్ లోషన్ రాయడంతో పాటు సహజంగా కూడా కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే చర్మం ట్యాన్‌కు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో చర్మ విషయంలో సహజ చిట్కాలు తప్పనిసరిగా పాటించండి. అయితే మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Summer skincare : వేసవిలో చర్మం తొందరగా నల్లగా మారుతుంది. కాస్త బయటకు వెళ్తే.. చాలు ముఖం అంతా కూడా ట్యాన్గా మారుతుంది. బయటకు వెళ్లేటప్పుడు ఎన్ని సన్‌స్క్రీన్స్ అప్లై చేసినా కూడా ముఖం ట్యాన్‌కు గురవుతుంది. వేసవిలో ముఖం అసలు గ్లోగా ఉండదు. దీనికి తోడు నల్లగా మచ్చలు, మొటిమలు కూడా వస్తాయి. అయితే వేసవిలో చర్మం నల్లగా మారకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు చర్మం ఎలాంటి ట్యాన్‌కు గురి కాకుండా మెరిసిపోతుంది. వేసవిలో ముఖానికి ఎన్ని క్రీంలు రాసినా కూడా ట్యాన్ కావడం పక్కా. ఎందుకంటే సూర్యరశ్మికి చర్మం ఆటోమెటిక్‌గా నల్లగా మారుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ రాయడంతో పాటు సహజంగా కూడా కొన్ని చిట్కాలు పాటించాలి. అప్పుడే చర్మం ట్యాన్‌కు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో చర్మ విషయంలో సహజ చిట్కాలు తప్పనిసరిగా పాటించండి. అయితే మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఐస్ ప్యాక్
ఒక కాటన్ క్లాత్‌లో ఐస్ ముక్కలు వేసవి ముఖానికి అప్లై చేయాలి. సున్నితంగా చర్మంపై రుద్దితే.. ట్యాన్ నుంచి తక్షణమే విముక్తి కలుగుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల చర్మం మెరిసిపోతుంది. ఎలాంటి మొటిమలు, మచ్చలు ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
పసుపు, శెనగపిండి ప్యాక్
ఏ సీజన్లో అయినా కూడా ముఖం మెరిసిపోవాలంటే మాత్రం తప్పకుండా ఈ ప్యాక్ వాడాల్సిందే. శెనగపిండిలో కాస్త పసుపు వేసి, నిమ్మకాయ రసం వేసి కలిపిన ప్యాక్‌ను ముఖానికి అప్లై చేస్తే.. ట్యాన్ అంతా పోతుంది. ముఖం అయితే వెంటనే మెరిసిపోతుంది. అయితే టమాటా రసం, పాలు, రోజ్ వాటర్ వంటివి కూడా కలిపి ప్యాక్ చేయవచ్చు. వీటివల్ల ముఖంపై ఉన్న ముడతలు పోతాయి. వయస్సు పెరిగినా కూడా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. డైలీ కాకపోయినా వేసవిలో కనీసం వారానికి రెండు సార్లు అయినా ప్యా్క్ వేసుకుంటే మంచిది.
కలబంద
రోజూ నిద్రపోయే ముందు ముఖానికి కలబందను రాస్తే.. సహజంగా చర్మం మెరిసిపోతుంది. ఈ కలబంద ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కలబందలోని పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖంపై ఉండే ట్యాన్‌ను తొలగిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డైలీ ఏదో ఒక సమయంలో ముఖానికి కలబంద రాసుకున్నా కూడా ఆరోగ్యానికి మంచిదే.
పెరుగు
పెరుగు, పసుపు, శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే బాగుంటుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను చర్మానికి అప్లై చేస్తే ముఖం అంతా కూడా మెరిసిపోతుంది. ఒక్కసారిగా గ్లో వస్తుంది. ముఖంపై ఉండే ట్యాన్, మొటిముల అన్ని కూడా క్లియర్ అవుతాయి. వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవచ్చు.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.