Hair Dye : హెయిర్ డై సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు నల్లగా ఉండాలంటే ఇలా చేయండి

Hair Dye : ప్రస్తుత కాలంలో వయసు పెరగడం, ఒత్తిడి, కాలుష్యం, కెమికల్స్ కలిపిన ఉత్పత్తుల వాడకం వల్ల జుట్టు చిన్న వయసులోనే తెల్లబడటం ఒక సాధారణ సమస్యగా మారింది. ఇలా తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే హెయిర్ డైలు లేదా కలర్లను ఆశ్రయిస్తారు. అయితే, ఈ హెయిర్ డైలలో ఉండే అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి కెమికల్స్ దీర్ఘకాలంలో జుట్టుకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఇవి జుట్టు మూలాలను బలహీనపరచడమే కాకుండా, జుట్టును పొడిగా, నిర్జీవంగా మార్చి, సమయానికి ముందే రాలిపోయేలా చేస్తాయి.
మీరు కూడా జుట్టును సహజసిద్ధంగా నల్లగా మార్చుకోవాలనుకుంటే దానికి ఒక సులభమైన, ప్రభావవంతమైన ఇంటి చిట్కా ఉంది. అదే మనం రోజూ ఉదయం శక్తి కోసం తాగే కాఫీ. అదే కాఫీ మీ తెల్లబడిన జుట్టును సహజంగా ముదురు రంగులోకి మార్చడానికి సాయపడుతుంది. కాఫీలో సహజసిద్ధమైన డైయింగ్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టుకు ఎటువంటి హాని కలిగించకుండా ముదురు రంగును ఇస్తాయి. అంతేకాకుండా ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. మరి కాఫీతో జుట్టును నల్లగా మార్చుకునే సురక్షితమైన పద్ధతిని తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్లు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ (లేదా ఏదైనా ముదురు రంగు కాఫీ), 1 కప్పు నీరు, 1 టేబుల్ స్పూన్ మీకు నచ్చిన కండిషనర్, 1 టేబుల్ స్పూన్ హెయిర్ ఆయిల్ (కొబ్బరి నూనె లేదా బాదం నూనె)
Read Also:TDP Mahanadu : టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం.. భారీగా తరలిరానున్న జనసందోహం!
పేస్ట్ తయారుచేసే విధానం
* ముందుగా నీటిని వేడి చేసి, అందులో కాఫీ పౌడర్‌ను వేయండి.
* కాఫీ పౌడర్ బాగా కలిసేలా చూసి, దాన్ని చల్లారనివ్వండి.
* ఇప్పుడు ఈ కాఫీ మిశ్రమంలో నచ్చిన కండిషనర్ను కావాలనుకుంటే కొద్దిగా హెయిర్ ఆయిల్‌ను కలపండి.
* ఈ మిశ్రమాన్ని శుభ్రమైన, పొడి జుట్టుకు వేర్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించండి.
* జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి, సుమారు గంట పాటు అలాగే ఉంచండి.
* ఒక గంట తర్వాత, జుట్టును సాదా నీటితో శుభ్రంగా కడగండి. షాంపును ఉపయోగించవద్దు.
* మొదటిసారి వాడినప్పుడే జుట్టు రంగులో తేలికపాటి తేడా కనిపిస్తుంది. మెరుగైన ఫలితాల కోసం దీన్ని వారానికి 2-3 సార్లు ఉపయోగించవచ్చు.
Read Also:DRDO Recruitment 2025: డిఆర్డిఓలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌తో 148 పోస్టుల భర్తీ
కాఫీ హెయిర్ డై వల్ల కలిగే ప్రయోజనాలు:
కాఫీ హెయిర్ డై వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సహజసిద్ధమైనది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది పూర్తిగా సహజసిద్ధమైన పద్ధతి కాబట్టి ఎటువంటి రసాయనాలు లేకుండా జుట్టుకు రంగు వస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.అలాగే ఇది జుట్టుకు మంచి రంగును ఇవ్వడమే కాకుండా, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కాఫీ స్కాల్ప్‌కు (తల చర్మం) పోషణను అందించి, జుట్టు మూలాలను బలపరుస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఈ సులభమైన, సురక్షితమైన పద్ధతితో తెల్లబడిన జుట్టు సమస్యకు రసాయనాలు లేని పరిష్కారాన్ని పొందవచ్చు.