TDP Mahanadu : టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధం.. భారీగా తరలిరానున్న జనసందోహం!

TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మక మహానాడు ఏర్పాట్లు కడపలో కొలిక్కి వచ్చాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభకు ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ కీలక నాయకులు కడపకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సోమవారం సాయంత్రానికి కడపకు చేరుకుంటారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు ఈ వేడుకకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
మహానాడులోని ప్రతినిధుల సభా వేదికపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్టీ కార్యవర్గ సభ్యులు కలిపి దాదాపు 450 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక ఎదురుగా 25 వేల మందికి సరిపడా విశాలమైన ప్రాంగణాన్ని నిర్మించారు. మరోవైపు, బహిరంగ సభ ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ సభ కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు అతిపెద్ద భోజనశాలలను ఏర్పాటు చేశారు. అలాగే, పార్టీ చరిత్రను, నాయకుల సేవలను గుర్తుచేసే ఫోటో ప్రదర్శన, మానవతా దృక్పథంతో రక్తదాన శిబిరం, ప్రవేశ రిజిస్ట్రేషన్ల కోసం వేర్వేరు ప్రాంగణాలను నిర్మించారు.
Read Also:Ration Card : 6 నెలలుగా రేషన్ తీసుకోని 96 వేల కార్డులు.. అనుమానాస్పద కార్డులపై సర్కార్ విచారణ!
బహిరంగ సభకు వచ్చే వారికి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పులివెందుల రోడ్డు, తాడిపత్రి-కమలాపురం రోడ్డు, సిద్దవటం-బద్వేల్ రోడ్డు, సీకే దిన్నె-రాజంపేట రోడ్డు, మైదుకూరు-కర్నూలు మార్గాల్లో చేరుకోవచ్చు. ఈ మార్గాల్లో 5 కిలోమీటర్ల ముందు నుంచే మహానాడు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు, తద్వారా కార్యకర్తలు సులభంగా వేదికను చేరుకోగలరు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులకు ప్రవేశ మార్గాల్లోనే భోజనశాలలు అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏర్పాట్లను మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, నిమ్మల రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు బీద రవిచంద్రయాదవ్, రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, అమర్నాథ్రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య పనులను పరిశీలించి, దిశానిర్దేశం చేశారు.
Read Also:Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
మహానాడు భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజల భద్రతపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ మహానాడు టీడీపీ భవిష్యత్ కార్యాచరణకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయగలదని ఆశిస్తున్నారు.
-
Chandrababu : మోదీ ప్రశంసలు అందుకున్న చంద్రబాబు.. ఏపీ అభివృద్ధి మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు సిఫార్సు!
-
Ap: గర్భిణులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ వస్తువులన్నీ ఇకపై ఫ్రీ
-
AP Government: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగస్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
-
Heroine Poonam Kaur: చంద్రబాబుతో హీరోయిన్ పూనం కౌర్.. హాట్ టాపిక్
-
Champions trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో సందడి చేసిన లోకేష్.. సుకుమార్, చిరంజీవి కూడా..
-
Kadapa: ఈ శివాలయంలో రాయి పడితే.. మీ కోరికలు నెరవేరడం ఖాయం