DRDO Recruitment 2025: డిఆర్డిఓలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌తో 148 పోస్టుల భర్తీ

DRDO Recruitment 2025: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో సైంటిస్ట్ కావాలని అనుకుంటున్నారా ? అయితే ఇది మంచి అవకాశం. డిఆర్డిఓ పలు సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్థులు డిఆర్డిఓ అధికారిక వెబ్సైట్ rac.gov.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ Employment News నోటిఫికేషన్లో ప్రచురించిన తేదీ నుంచి 21 రోజులు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ జూన్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 148 సైంటిస్ట్ పోస్టులు భర్తీ కానున్నాయి.
ఖాళీల వివరాలు:
* డిఆర్డిఓలో సైంటిస్ట్ ‘బి’: 127 పోస్టులు
* ఏడీఏ (ADA) లో సైంటిస్ట్/ఇంజనీర్ ‘బి’: 9 పోస్టులు
* సైంటిస్ట్ ‘బి’ ఎన్కేడర్డ్ పోస్టులు: 12 పోస్టులు
Read Also:Civil Services Exam :యూపీఎస్సీ సంచలన నిర్ణయం.. సివిల్స్ పరీక్షల్లో ఫేస్ రికగ్నిషన్, AI కెమెరాలు
అర్హత ప్రమాణాలు (Eligibility Criteria)
విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అంతేకాకుండా గేట్ (GATE) పరీక్షలో వ్యాలిడ్ స్కోర్ కూడా తప్పనిసరి.
ఏజ్ లిమిట్
* జనరల్, ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు.
* ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు 38 సంవత్సరాలు.
* ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు గరిష్టంగా 40 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
దరఖాస్తు రుసుము (Application Fee)
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.100 నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి.
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు (Divyangjan), మహిళా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుం లేదు.
Read Also:Viral Video : గుర్రం ఒక్క కిక్ ఇచ్చింది.. దెబ్బకు పరుగులంకించుకున్న పిట్ బుల్
ఎంపిక ప్రక్రియ (Selection Process)
అర్హులైన అభ్యర్థులను గేట్ (GATE) స్కోర్ ఆధారంగా 1:10 నిష్పత్తిలో సబ్జెక్టుల వారీగా, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఢిల్లీలో లేదా ఆర్ఏసీ (RAC)/డిఆర్డిఓ నిర్ణయించిన ఇతర ప్రదేశంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అభ్యర్థుల తుది ఎంపిక పూర్తిగా గేట్ స్కోర్ మార్కులకు 80శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 20శాతం వెయిటేజీ మొత్తం ఆధారంగా ఉంటుంది.