Viral Video : పసికందుతో కింగ్ కోబ్రా ఆట.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral Video : కింగ్ కోబ్రా.. ఈ పేరు వినగానే మనకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా దీనికి పేరుంది. ఇది కరిస్తే కేవలం 45 నిమిషాల్లోనే మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు. అలాంటి అత్యంత ప్రమాదకరమైన పాముతో ఒక చిన్న పిల్లాడు నిశ్చింతగా ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పసికందు నేలపై బుసలు కొడుతున్న కోబ్రాను ఏదో ఆట బొమ్మను పట్టుకోవాలనుకున్నట్లు ప్రయత్నిస్తున్నాడు. అప్పుడప్పుడు ఆ పాము పడగను తాకబోతున్నాడు. మరికొన్నిసార్లు దాని తోకను లాగుతున్నాడు. ఈ దృశ్యం చూస్తుంటేనే భయమేస్తుంది. ఒక క్షణం ఏమయినా జరిగినా, ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అని ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.
Read Also:Feel Shocked: టచ్ చేసినప్పుడు షాక్ కొట్టిన ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే?
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన, విషపూరితమైన పాము అయిన కింగ్ కోబ్రా ఆ చిన్నారి ముందు చాలా ప్రశాంతంగా ఉంది. అది పిల్లాడిపై దాడి చేసే ప్రయత్నం చేయలేదు. కరిచే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ పసికందు ఏ మాత్రం భయం లేకుండా, అమాయకంగా దానితో ఆడుకుంటూ ఉన్నాడు. పాము కూడా ఆ పిల్లాడికి ఎటువంటి హాని తలపెట్టకుండా శాంతంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
Cobra vs Babua pic.twitter.com/1gpOZt7d3S
— rareindianclips (@rareindianclips) May 26, 2025
సోషల్ మీడియాలో వైరల్
ఈ వీడియోను X (గతంలో ట్విట్టర్)లో @rareindianclips అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను 54 వేలకు పైగా సార్లు చూశారు. నెటిజన్లు కామెంట్ సెక్షన్లో తమ ఆశ్చర్యాన్ని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. వీడియోను షేర్ చేసిన యూజర్ “కోబ్రా వర్సెస్ బబువా” (కోబ్రా Vs చిన్నారి) అని క్యాప్షన్ ఇచ్చారు.
Read Also:Jobs in Reserve Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎన్ని గంటలు వర్క్ చేస్తే అంత జీతం
నెటిజన్ల ఆందోళన
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ “బహుశా పాము కోరల్లో విషం తీసేసి ఉంటారు” అని కామెంట్ చేయగా, మరొక నెటిజన్ “విషం తీసేసినా సరే, పాము పిల్లలకి గాయం చేయగలదు కదా” అని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంకొకరు, “ఎందుకో తెలీదు కానీ, పిల్లలకి పాములంటే భయం ఉండదు” అని రాశారు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Viral Video : పాకిస్తాన్ లో అంతే.. 18మంది ప్రవాహం కొట్టుకుపోతున్నా సినిమా చూసినట్లు చూశారు