Jobs in Reserve Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎన్ని గంటలు వర్క్ చేస్తే అంత జీతం
Jobs in Reserve Bank of India.. ఆ తర్వాత డిగ్రీ కాపీ, ఫోటో, సంతకం పెట్టి అన్ని డాక్యుమెంట్స్‌ను కూడా యాడ్ చేసి అడ్రస్‌కు పంపాలి. అయితే జూన్ 6వ తేదీలోగా ఈ అడ్రస్‌కు పంపించాలి.

Jobs in Reserve Bank: రిజర్వ్ బ్యాంక్ అంటే ఆ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో డాక్టర్‌కు సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. మీరు డాక్టర్ అయితే రిజర్వ్ బ్యాంకులో పనిచేయాలనుకుంటే ఇది మీ కోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేయాలని కొందరు కలలు కంటుంటారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఉద్యోగం. అయితే ఇవి రెగ్యూలర్ పోస్టులు కాదు. కేవలం కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఉద్యోగం చేయాలని అనుకునే వారు అప్లై చేసుకోవచ్చు. rbi.org.in వెబ్సైట్లోకి వెళ్లి ఒక ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీన్ని ఫిల్ చేసి రీజినల్ డైరెక్టర్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ (రిక్రూట్మెంట్ సెక్షన్), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజినల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్, ఫోర్ట్, ముంబై – 400001 కు పంపాలి.
Read Also: ఆమె డిమాండ్లలో తప్పేలేదు.. దీపిక పదుకొణేకు మద్దతు పలికిన అజయ్ దేవ్ గన్
ఆర్బీఐ మొత్తం 13 పోస్టులకు రిక్రూట్మెంట్ రిలీజ్ చేసింది. దీనికి అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్ లేదా ఎండీ డిగ్రీ అర్హత ఉండాలి. ఈ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నవారు. అలాగే జనరల్ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. దీనికి ఎలాంటి వయో పరిమితి అయితే లేదు. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు గంటకు రూ.1000 వరకు జీతం చెల్లిస్తారు. అంటే మీరు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తే దాని బట్టి డబ్బులు ఇస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగం కాబట్టి రోజుకి కొన్ని గంటలు మాత్రమే డబ్బులు ఇస్తారు. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నియామకంలో రాత పరీక్ష ఉండదు. మీ పత్రాలు సరిగ్గా ఉండి మీరు ఇంటర్వ్యూలో సెలక్ట్ అయితే ఎంపికయ్యే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. దరఖాస్తు ఆఫ్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి. ముందుగా మీరు ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ rbi.org.in కి వెళ్లాలి. ఆ తర్వాత రిక్రూట్మెంట్ విభాగంలో మెడికల్ కన్సల్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోకి వెళ్లాలి. దీన్ని ప్రింట్ తీసుకుని ఫారమ్ నింపాలి. ఆ తర్వాత డిగ్రీ కాపీ, ఫోటో, సంతకం పెట్టి అన్ని డాక్యుమెంట్స్‌ను కూడా యాడ్ చేసి అడ్రస్‌కు పంపాలి. అయితే జూన్ 6వ తేదీలోగా ఈ అడ్రస్‌కు పంపించాలి.
-
Indian Air Force Agniveer Recruitment 2025: ఇంటర్ పూర్తి చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు
-
IBPS Notification: గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వేలలో బ్యాంకులో ఉద్యోగాలు!
-
Microsoft Lay Offs: మైక్రోసాఫ్ట్‌లో భారీగా లేఆఫ్స్.. ఏఐ రావడమే ఈ లేఆఫ్స్‌కు కారణమా!
-
SBI: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎస్బీఐలో అదిరిపోయే పోస్టులు
-
Jobs:అదిరిపోయే నోటిఫికేషన్.. జాబ్ వస్తే లైఫ్ సెట్ ఇక
-
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 4500 పోస్టులకు నోటిఫికేషన్