Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Lifestyle News »
  • Liver Health Dont Eat These Foods Is Not Fir Health

Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే

Liver Health: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండాల్సిందే
  • Edited By: kusuma,
  • Updated on June 5, 2025 / 06:50 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Liver Health: పోషకాలు లేని ఫుడ్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా లివర్ దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. మూడు రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొందరి లివర్ దెబ్బతింటుంది. ఈ రోజుల్లో చాలా మంది బయట ఫుడ్ తినడానికి బాగా అలవాటు పడ్డారు. ఇందులో పోషకాలు ఉండవు. అంతా కూడా ఎన్నో రోజుల నుంచి స్టాక్ ఉంటుంది. మంచి ఆయిల్ ఉండదు. అలాగే మసాలా ఎక్కువగా ఉండటంతో పాటు కొన్ని రోజుల పాటు వాటిని స్టాక్ ఉంచుతారు. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ పాడవడం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో ఒకసారి తింటే పర్లేదు. కానీ ఈ మధ్య కాలంలో బయట ఫుడ్‌కి బాగా అలవాటు పడిన వారు డైలీ తింటున్నారు. అయితే డైలీ ఇలా బయట తినడం వల్ల లివర్ తప్పకుండా పాడవుతుంది. మరి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పదార్థాలను డైలీ తీసుకోకూడదో ఈ స్టోరీలో చూద్దాం.

ఫ్రక్టోజ్

ఫ్రక్టోజ్ అంటే తీపి. ఎక్కువగా తీపి వస్తువులు, పానీయాలు, స్నా్క్స్ ఇలా అన్ని ఉంటాయి. అయితే ఇవి లివర్ పాడవడానికి కారణమవుతాయి. ఎందుకంటే ఇందులోని తీపి బాడీలోని కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. లిమిట్‌లో తీసుకుంటే పర్లేదు. కానీ అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొందరు డైలీ బయట ఉండే సాఫ్ట్ డ్రింక్స్ వంటివి తీసుకుంటారు. వీటివల్ల ఈ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఈ ఫ్రక్టోజ్‌ను ఎక్కువగా తీసుకోకండి.

సీడ్ ఆయిల్స్

సోయాబీన్, మొక్కజొన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ లివర్‌లో మంటను, ఆక్సిడేటివ్ ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల తొందరగా లివర్ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సీడ్ ఆయిల్స్ కాకుండా కొబ్బరి, నువ్వుల నూనెను వంటల్లో ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రూట్ జ్యూస్‌లు

చాలా మంది పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివని వీటిని తీసుకుంటారు. కానీ వీటిలో 100 శాతం వరకు ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. పీచు తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతాయి. ఎక్కువగా చక్కెర పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి అధిక మొత్తంలో ఫ్రూట్ జ్యూస్‌లు అయితే తీసుకోవద్దు. దీనివల్ల లివర్ పూర్తిగా దెబ్బతింటుంది.

Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.

Tag

  • Foods
  • Health
  • Health issues
  • Liver Health
Related News
  • CPR: గుండెపోటు వచ్చినప్పుడు ఇలా సీపీ ఆర్ చేస్తే.. ప్రాణాలు సేఫ్

  • Blue Berry Daily: రోజుకో బ్లూ బెర్రీ.. ఇక మీ ఆరోగ్యానికి నో వర్రీ

  • Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా

  • Liver Infections: లివర్‌కు ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి? అవి ఎలా మొదలవుతాయి?

  • Breakfast: బ్రేక్ ఫాస్ట్ టైంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా?

  • AC: ఏసీలో ఎక్కువ సమయం ఉంటే.. బరువు పెరుగుతారా?

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us