Exams complete: విద్యార్థులకు పరీక్షలు ముగిశాయా.. ఓ కన్నేసి ఉంచండి

Exams complete: పరీక్షలు పూర్తి అయ్యి విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చాయి. ఒక్క రోజు సెలవు వస్తేనే పిల్లలను కాపాడటం చాలా కష్టం. కొన్ని నిమిషాల గ్యాప్‌లోనే ఎక్కడికైనా వెళ్లి, ఏం చేసేస్తారో అని తల్లిదండ్రులకు భయం ఉంటుంది. గ్రామాల్లో అయితే పిల్లలు తోటలు, చెరువులు అన్నింటికి వెళ్తుంటారు. ఏ మాత్రం అజాగ్రత్త అయినా కూడా పిల్లలు ప్రమాదంలో పడతారు. సెలవులు కదా అని పిల్లలను అలా వదిలేయకండి. వేసవిలో వారికి కొత్త విషయాలు నేర్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి అలవాటు చేయండి. ఉదాహరణకు మీ పిల్లలకు కేవలం ఒక భాష మాత్రమే వస్తే కొత్త భాష నేర్చుకునేలా చేయండి. పిల్లలు కొత్త విషయాలు నేర్చుకునే దానిపై ఆసక్తి పెట్టడం వల్ల బయట ఎక్కువగా తిరగడానికి వెళ్లరు. అలాగే ఇంట్లో ఉంటారు. దీనివల్ల మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అయితే అప్పుడప్పుడు పిల్లలకు బయటకు కూడా పంపండి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటే వారికి ఏం తెలియదు. కాబట్టి బయటకు పంపండి. కానీ మీరు కూడా ఆ సమీపంలో ఉండండి. పిల్లలు సేఫ్ కాదా? అని గమనించాలి. దీనివల్ల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పిల్లలు వేసవిలో ఎటు వెళ్తారో వారికే తెలియదు. అందరి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ ఎటు వైపు వెళ్లినా ప్రమాదమే.
పిల్లలకు వేసవిలో ఇంట్లోనే ఆడుకునేలా ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇండోర్ గేమ్స్ ఆడుకునేలా చేయండి. దీనివల్ల కూడా వారి మైండ్ పవర్ బాగా పెరుగుతుంది. ఉదాహరణకు చెస్, క్యారెమ్స్, పజిల్స్ వంటివి వాటితో ఆడటం వల్ల పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. వారి మైండ్ పవర్ కూడా బాగా పెరుగుతుంది. పిల్లలు కూడా యాక్టివ్‌గా ఉంటారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. వేసవిలో పిల్లలు ఎక్కువగా తోటకు వెళ్తుంటారు. తోటలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వాళ్లు ఉంటేనే ఇలాంటి ప్రదేశాలకు పంపండి. లేకపోతే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. తోటల్లో బావిలు వంటివి ఉంటాయి. వేసవిలో చాలా మంది పిల్లలు ఈతకు వెళ్తుంటారు. ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు బాగా వస్తాయి. కొన్నిసార్లు అందులో మృతి చెందే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలను అసలు బయటకు పంపవద్దు. వేసవిలో రోజూ యోగా, మెడిటేషన్ వంటివి పిల్లలతో చేయించండి. అలాగే రోజులో కొంత సమయం తల్లిదండ్రులు సరదాగా పిల్లలతో గడపండి. దీనివల్ల వారు సంతోషంగా ఉంటారు. అలాగే ఆడటానికి బయటకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే అప్పుడప్పుడు పిల్లలను ఇంటి ముందే ఆడుకోవడానికి బయటకు పంపండి. దీనివల్ల పిల్లలకు కూడా ఫ్రీ ఉంటుంది. ఎందుకంటే వారికి కూడా ఎవరితో అయినా సరదాగా ఆడుకోవాలని ఉంటుంది. దీనివల్ల వారికి కూడా ఒంటరితనం అనే ఫీలింగ్ ఉండదు.
-
Summer Fruit: సమ్మర్లో దొరికే ఈ ఫ్రూట్ తింటే.. రోగాలన్నీ పరార్
-
Rashmika Mandanna: రష్మిక ఆస్తులు తెలిస్తే.. షాక్ కావాల్సిందే
-
Concentration: ఏకాగ్రత ఉన్నవారిలో కనిపించే లక్షణాలివే
-
Motorola: రూ.6999 కే 50MP కెమెరా ప్రీమియం లుక్ ఫోన్..!
-
Indian Post: GDS రిజల్ట్స్ వచ్చేసాయ్.. ఇలా చెక్ చేసుకోండి!
-
TVS Jupiter: చీపెస్ట్ స్కూటీ.. ప్రారంభ ధర రూ.53వేలు.. 226కి.మీ గరిష్ట మైలేజ్.. !