Shobana : చెట్టు వెనుకకు వెళ్లి బట్టలు మార్చుకోమన్నారు.. సీనియర్ నటి ఆవేదన

Shobana : అలనాటి అందాల నటి, క్లాసికల్ డ్యాన్సర్ శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. తాజాగా, తన సినీ జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన గురించి శోభన బయటపెట్టారు. ఆ సంఘటనలో అమితాబ్ బచ్చన్ ఆమెకు ఎలా అండగా నిలిచారో ఆమె వివరించారు.
షూటింగ్ స్పాట్‌లో శోభనకు అవమానం
నటి శోభన (Shobana) తెలుగుతో పాటు, తమిళం, మలయాళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ‘కల్కి’ వంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే, తన సినీ జీవితంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనను ఇటీవల బయటపెట్టారు. “నేను అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గారితో చాలా సినిమాలు చేశాను. ఆయన ఎంతో మంచి వ్యక్తి” అని శోభన తెలిపారు.
Read Also:Knee Pain : మోకాళ్ళు, కాళ్ళ నొప్పులు.. ఇది సాధారణమా, లేక ప్రమాద సంకేతమా?
గతంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఒక సినిమా షూటింగ్ కోసం తాను అహ్మదాబాద్ (Ahmedabad) వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగిందని శోభన వివరించారు. “అప్పట్లో హీరోయిన్లకు కారవాన్‌లు (Caravan) ఇచ్చే పద్ధతి లేదు. సాంగ్ షూటింగ్ కోసం దుస్తులు మార్చుకోవాలి. అమితాబ్ గారికి కారవాన్ ఇచ్చారు. కానీ నాకు కారవాన్ లేదు. మూవీ టీమ్ సభ్యులు చెట్టు పక్కకు వెళ్లి దుస్తులు మార్చుకోమని చెప్పారు. నాకు చాలా బాధేసింది. ‘ఈమె కేరళ (Kerala) నుండి వచ్చింది. దేనికైనా అడ్జస్ట్ అవుతుంది’ అంటూ మాట్లాడారు” అని శోభన చెప్పుకొచ్చారు.
అమితాబ్ బచ్చన్ ఆగ్రహం
ఈ విషయం అమితాబ్ బచ్చన్ గారికి తెలిసింది. ఆయన వెంటనే తన కారవాన్ నుండి బయటకు వచ్చి చాలా సీరియస్ అయ్యారు. మూవీ టీమ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “నా కారవాన్ ఆమెకు ఇవ్వండి, దుస్తులు మార్చుకోమని చెప్పండి” అంటూ తన కారవాన్‌ను శోభనకు ఇచ్చారు. ఈ సంఘటన అమితాబ్ బచ్చన్ గొప్ప వ్యక్తిత్వాన్ని, తోటి నటీనటుల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. అప్పట్లో కారవాన్‌ల సౌకర్యం తక్కువగా ఉన్నప్పటికీ, ఒక సీనియర్ నటి పట్ల చూపిన ఈ నిర్లక్ష్యం బాధాకరమని శోభన ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సంఘటన శోభనకు బాధ కలిగించినప్పటికీ అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప వ్యక్తి అండగా నిలవడం ఆమెకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని శోభన తెలిపారు.
Read Also:IPL 2025 : ఐపీఎల్ వేలంలో రూ. 20 కోట్ల బిడ్..వాష్ రూంలోకి పరిగెత్తిన శ్రేయాస్ అయ్యర్!
-
Sanjay Dutt : అనవసరంగా చేశా.. డైరెక్టర్ లోకేష్ పై సీరియస్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్
-
Rashmika : ఏంటి ఇంత డర్టీగా మారిపోయింది.. అసలు రష్మికానేనా.. అస్సలు గుర్తు పట్టలేం
-
Rashmika : వామ్మో.. బాలీవుడ్లో పని చేయడం చాలా కష్టం.. రష్మిక సంచలన వ్యాఖ్యలు
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?
-
Deepika Padukone : సరికొత్త రికార్డు నెలకొల్పిన దీపికా పదుకొణె.. హాలీవుడ్‌లో మెరిసిన భారత ఆణిముత్యం
-
Coolie : రజనీకాంత్ ‘కూలి’ సినిమాకు టైటిట్ గోల.. మళ్లీ కొత్త పేరు.. ఇంతకీ ఏమైందంటే ?