Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Business News »
  • Do You Know How Much Data One Person Consumes Per Month

Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?

Mobile Data : ఇంటర్నెట్ వాడకంలో ఇండియా టాప్.. నెలకు ఒక వ్యక్తి ఎంత డేటా వాడుతున్నాడో తెలుసా?
  • Edited By: rocky,
  • Updated on June 25, 2025 / 12:30 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Mobile Data : ఈ రోజుల్లో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లు వాడుతూనే కనిపిస్తున్నారు. అయితే, భారతదేశంలో ఒక మనిషి సగటున నెలకు ఎంత ఇంటర్నెట్ డేటా వాడుతున్నారో తెలుసా ? ఇటీవల విడుదలైన ఎరిక్సన్ మొబిలిటీ 2025 నివేదిక ప్రకారం.. మొబైల్ డేటా వినియోగం విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తేలింది. భారతదేశంలో సగటున ఒక స్మార్ట్‌ఫోన్ యూజర్ ప్రతి నెలా 32GB డేటాను వాడుతున్నాడు. ఈ సంఖ్య రాబోయే ఐదేళ్ళలో అంటే 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. గత నవంబర్‌లో వచ్చిన నివేదికలో 2030 నాటికి ఒక యూజర్ నెలవారీ డేటా వినియోగం 66GBకి పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, ఈ తాజా నివేదికలో ఆ అంచనాను 4 శాతం తగ్గించి 62GBకి కుదించారు.

ఈ నివేదికలో 2030 నాటికి భారతదేశంలో 5G సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రస్తుత వినియోగదారులతో పోలిస్తే ఇది మూడు రెట్లు పెరిగి దాదాపు 98 కోట్ల మందికి చేరుకుంటుందని పేర్కొన్నారు. మెరుగైన మిడ్-బ్యాండ్ కవరేజ్, టెలికాం కంపెనీలు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ పై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఈ భారీ వృద్ధి కనిపిస్తోంది. మరోవైపు, ఇదే కాలంలో 4G యూజర్ల సంఖ్య 60 శాతం మేర తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలా జరిగితే, 4G యూజర్ల సంఖ్య సుమారు 230 మిలియన్లకు పడిపోతుంది.

Read Also:Dry Fruits: ఉదయం ఏ డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

గత ఏడాది చివరి నాటికి, భారతదేశంలో మిడ్-బ్యాండ్ 5G కవరేజ్ ఇప్పటికే 95 శాతం మంది ప్రజలకు చేరుకుంది. భారతదేశంలో 5G ఇంత వేగంగా వృద్ధి చెందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇంటర్నెట్ డేటా ధరలు చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ కారణంగానే ఇంటర్నెట్ అంతమందికి చేరువ అయింది.

ప్రపంచవ్యాప్తంగా కూడా, మొబైల్ డేటా ట్రాఫిక్ ఏడాదికి 19 శాతం చొప్పున పెరుగుతోంది. 2030 నాటికి ఇది రెట్టింపు కంటే ఎక్కువగా అవుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశం ఈ డిజిటల్ విప్లవంలో ముందుండి నడిపిస్తుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Read Also:Viral Video: ఏదేమైనా ఈ బామ్మ సూపర్బ్.. 80ఏళ్లలో ట్రాక్టర్ జోరుగా నడిపి అదరగొట్టింది

Tag

  • 4G Users
  • 5G Subscribers
  • Digital India
  • Ericsson Mobility Report
  • Internet Usage
Related News
  • My Bharat : ‘మై భారత్’ పోర్టల్ ఇప్పుడు వాట్సాప్‌లోనే.. ఒక్క ‘హాయ్’తో యువతకు బోలెడు అవకాశాలు!

  • Recharge Plan : జియో, ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్.. గంటల లెక్కన ఇంటర్నెట్ డేటా?

  • Voter ID Card : ఓటర్లకు గుడ్ న్యూస్.. 15 రోజుల్లోనే ఇంటికే ఓటర్ ఐడీ కార్డు!

  • Driverless Car : త్వరలో ఇండియాలో డ్రైవర్‌లెస్ కార్ల ట్రయల్స్ ప్రారంభం..ప్రభుత్వం భారీ సన్నాహాలు!

  • Job Creation : మేక్ ఇన్ ఇండియా నుంచి డిజిటల్ ఎకానమీ వరకు.. 10ఏళ్లలో 17కోట్ల ఉద్యోగాలు

  • Smart Phone : డిజిటల్ ఇండియా ఎఫెక్ట్.. దాని వినియోగంలో అమెరికాను దాటేసిన భారత్

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us